లండన్ బయలుదేరిన మెగా ఫ్యామిలీ!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినీ ప్రస్థానంలో మరో కీలక ఘట్టం జరగబోతోంది. లండన్‌లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.;

By :  S D R
Update: 2025-05-06 02:12 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినీ ప్రస్థానంలో మరో కీలక ఘట్టం జరగబోతోంది. లండన్‌లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ గౌరవం మెగా ఫ్యాన్స్‌కి, తెలుగు సినిమాకే కాకుండా, భారతీయ సినీ ప్రపంచానికి కూడా గర్వకారణంగా నిలుస్తోంది.

ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు మెగా ఫ్యామిలీ లండన్‌కి పయనమైంది. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్ దంపతులు ఉపాసన, క్లిన్ కారాతో కలిసి ఈ వేడుకలో పాల్గొననున్నారు.

రామ్ చరణ్ నటించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా విజయాన్ని సాధించి, ఆయనను గ్లోబల్ స్టార్‌గా నిలిపింది. ఈ చిత్రంలోని అల్లూరి సీతారామరాజు పాత్ర చరణ్ నటనకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చింది. ఆ ప్రభావంతోనే మేడమ్ టుస్సాడ్స్ ఈ గౌరవాన్ని ఇవ్వాలని నిర్ణయించింది.

మరోవైపు ఈనెల 11న లండన్ లోనే ఆస్కార్ విజేత కీరవాణి ఆధ్వర్యంలో 'ఆర్.ఆర్.ఆర్' లైవ్ ఆర్కెస్ట్రా జరగబోతుంది. ఆ కార్యక్రమానికి కూడా మెగా ఫ్యామిలీ హాజరుకానుందట.

Tags:    

Similar News