చక్రి వాయిస్‌లో 'మాస్ జాతర'!
మాస్ మహారాజ రవితేజకి, మ్యూజిక్ డైరెక్టర్ చక్రికి మధ్య మంచి అనుబంధం ఉండేది. రవితేజ సినిమాలతోనే చక్రి మ్యూజిక్ డైరెక్టర్ గా రాణించారు.;
మాస్ మహారాజ రవితేజకి, మ్యూజిక్ డైరెక్టర్ చక్రికి మధ్య మంచి అనుబంధం ఉండేది. రవితేజ సినిమాలతోనే చక్రి మ్యూజిక్ డైరెక్టర్ గా రాణించారు. అయితే సంగీత దర్శకుడిగా అగ్ర పథాన సాగుతున్న సమయంలోనే అర్థంతరంగా ఈ లోకాన్ని వీడారు చక్రి.
లేటెస్ట్ గా 'మాస్ జాతర'లోని ఫస్ట్ సింగల్ 'తూ మేరా లవర్' కోసం చక్రి వాయిస్ ను ఏ.ఐ. లో సృష్టించారు. 'ఇడియట్' సినిమాలోని 'చూపుల్తో గుచ్చి గుచ్చి' మ్యూజికల్ బిట్ ను కూడా ఈ పాటలో వాడారు. భీమ్స్ కంపోజిషన్ లో భాస్కర్ భట్ల రవికుమార్ ఈ పాటను రాశారు.
ఈ పాటలో లీడ్ పెయిర్ రవితేజ, శ్రీలీల మధ్య మాస్ స్టెప్పులు ఓ రేంజులో ఉన్నాయి. 'ధమాకా' తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న మరొక మ్యూజికల్ బొనాంజ 'మాస్ జాతర'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లో రూపొందుతున్న ఈ మూవీకి భాను బోగవరపు దర్శకుడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.