మంచు మనోజ్ ఓపెన్‌గా స్పందించాడు!
ఇటీవల పాత సినిమాల రీ-రిలీజ్ లు కొత్త సినిమాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ, ఈ అంశంపై పరిశ్రమలో గళమెత్తేవారు తక్కువగానే ఉన్నారు. తాజాగా, ‘భైరవం’ సినిమా సక్సెస్ మీట్లో హీరో మంచు మనోజ్ ఈ అంశంపై స్పష్టంగా స్పందించాడు.;
ఇటీవల పాత సినిమాల రీ-రిలీజ్ లు కొత్త సినిమాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ, ఈ అంశంపై పరిశ్రమలో గళమెత్తేవారు తక్కువగానే ఉన్నారు. తాజాగా, ‘భైరవం’ సినిమా సక్సెస్ మీట్లో హీరో మంచు మనోజ్ ఈ అంశంపై స్పష్టంగా స్పందించాడు.
మంచు మనోజ్ మాట్లాడుతూ – 'రీ-రిలీజ్ సినిమాలను వీకెండ్లలో కాకుండా వీక్ డేస్‌లో విడుదల చేస్తే కొత్త సినిమాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వీకెండ్ లలో విడుదల చేస్తే, ఓ తెలుగు సినిమా మరో తెలుగు సినిమాను దెబ్బతీయడమే అవుతుంది' అన్నాడు. రీ-రిలీజ్ సినిమాల వల్ల కలెక్షన్లు తక్కువవుతున్నాయని, ఇది నిజం అని చెప్పాడు. ఈ సమస్యపై సినీ పెద్దలు చర్చించి ఒక సుస్పష్టమైన విధానం తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.
‘భైరవం’ విడుదలైన రోజే మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’ రీ-రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అద్భుత స్పందన పొందడంతో, ‘భైరవం’ ఫస్ట్ డే కలెక్షన్లపై ప్రభావం పడిందన్నది ట్రేడ్ వర్గాల అభిప్రాయం. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు థియేటర్లలో ఉత్సాహంగా పాల్గొనడంతో 'ఖలేజా'కు హైప్ పెరిగింది.
ఈ నేపథ్యంలో ‘భైరవం’ నిర్మాత రాధామోహన్ కూడా స్పందిస్తూ – 'ఒక కొత్త సినిమా రిలీజవుతున్న సమయానికి పాత హిట్ సినిమాలు రీ-రిలీజ్ కావడం వల్ల మార్కెట్‌కి నష్టం జరుగుతోంది. ఇది పరిశ్రమలో చర్చించాల్సిన అంశం' అని అన్నారు.