‘మ్యాడ్ స్క్వేర్‘ ట్రైలర్.. లడ్డూ గాని పెళ్లిలో మస్త్ మజా!

‘మ్యాడ్’ సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన టీమ్.. ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’తో మరింత మజా పంచేందుకు రెడీ అయ్యింది.;

By :  S D R
Update: 2025-03-26 06:50 GMT

‘మ్యాడ్’ సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన టీమ్.. ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’తో మరింత మజా పంచేందుకు రెడీ అయ్యింది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్‘ మార్చి 28న థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది టీమ్.

‘మ్యాడ్‘ ఫస్ట్ పార్ట్ అంతా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటే.. ఇప్పుడు సీక్వెల్ కోసం గోవాని ఎంచుకుంది టీమ్. గోవాలో లడ్డూ గాని పెళ్లి కోసం ‘మ్యాడ్‘ గ్యాంగ్ ఎలాంటి సందడి చేసింది అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా ఆడియన్స్ ను ఫుల్ ఎంటర్ టైన్ చేయబోతున్నట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ట్రైలర్ ఆద్యంతం నవ్వులే నవ్వులు. మొత్తంగా.. ఈ వారం రాబోతున్న చిత్రాలలో పేరుకు చిన్న చిత్రమే అయినా.. ష్యూర్ షాట్ హిట్ గ్యారంటీ అనే నమ్మకంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది ‘మ్యాడ్ స్క్వేర్‘.


Full View


Tags:    

Similar News