నెట్‌ఫ్లిక్స్ లో 'మ్యాడ్ స్క్వేర్'!
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వచ్చిన మరో సూపర్ హిట్ మూవీ ‘మ్యాడ్ స్క్వేర్’. గతంలో ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టిన ‘మ్యాడ్’కి ఇది సీక్వెల్ కావడంతో మొదటినుంచి మంచి బజ్ తెచ్చుకుంది.;
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వచ్చిన మరో సూపర్ హిట్ మూవీ ‘మ్యాడ్ స్క్వేర్’. గతంలో ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టిన ‘మ్యాడ్’కి ఇది సీక్వెల్ కావడంతో మొదటినుంచి మంచి బజ్ తెచ్చుకుంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా తెరపై వచ్చింది.
నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ లాంటి యంగ్ యాక్టర్స్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, థియేటర్లలో మార్చి 28న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. సాంకేతిక పరంగా కూడా ఈ సినిమా బాగా డిజైన్ అయింది. భీమ్స్ అందించిన పాటలు, తమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు బలాన్ని చేకూర్చాయి. ఫలితంగా వరల్డ్ వైడ్‌గా రూ.80 కోట్ల గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.
ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’ ఓటీటీ ప్రీమియర్‌కు సిద్ధంగా ఉంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకొని, ఏప్రిల్ 25న తెలుగు తో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభించనుంది.