'మ్యాడ్ స్క్వేర్' ఓటీటీ స్ట్రీమింగ్!

సితార సంస్థ నుంచి వచ్చిన మరో సూపర్ హిట్ మూవీ 'మ్యాడ్ స్క్వేర్'. ఈ చిత్రంలో నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో నటించారు. డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ ఈ సినిమాను హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా మలిచాడు.;

By :  S D R
Update: 2025-04-14 01:29 GMT

సితార సంస్థ నుంచి వచ్చిన మరో సూపర్ హిట్ మూవీ 'మ్యాడ్ స్క్వేర్'. ఈ చిత్రంలో నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో నటించారు. డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ ఈ సినిమాను హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా మలిచాడు. భీమ్స్ అందించిన సంగీతం, తమన్ అందించిన నేపథ్య సంగీతం 'మ్యాడ్ స్క్వేర్'కి టెక్నికల్ గా ప్లస్ అయ్యాయి.

కథతో సంబంధం లేకుండా సినిమా మొత్తంలో ఎంటర్‌టైన్‌మెంట్ హైలైట్‌గా నిలవడంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభించింది. వరల్డ్ వైడ్ గా రూ.80 కోట్లకు వరకూ గ్రాస్ వసూళ్లను సాధించింది. లేటెస్ట్ గా 'మ్యాడ్ స్క్వేర్' ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమా ఏప్రిల్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ మూవీ పాన్-ఇండియా లెవెల్‌లో స్ట్రీమింగ్ అవుతోందా? లేక తెలుగులో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోందా? అనేది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News