కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ‘

‘బేబి‘ చిత్రంతో నిర్మాతగా ఎస్.కె.ఎన్, దర్శకుడిగా సాయి రాజేష్ ఎంతటి ఘన విజయాన్ని అందుకున్నారో తెలిసిందే. ప్రేమకథా చిత్రాల్లో ‘బేబి‘కి ఎప్పటికీ ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.;

By :  S D R
Update: 2025-06-02 12:17 GMT

‘బేబి‘ చిత్రంతో నిర్మాతగా ఎస్.కె.ఎన్, దర్శకుడిగా సాయి రాజేష్ ఎంతటి ఘన విజయాన్ని అందుకున్నారో తెలిసిందే. ప్రేమకథా చిత్రాల్లో ‘బేబి‘కి ఎప్పటికీ ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇప్పుడు ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ కలిసి మరో కల్ట్ లవ్ స్టోరీని అందించడానికి రెడీ అవుతున్నారు.

కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి ‘చెన్నై లవ్ స్టోరీ‘ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. హీరోహీరోయిన్లు సముద్రం ఒడ్డున కూర్చున్నారు. అప్పుడు ‘బేబి‘ సినిమాలోని ‘మొదటి ప్రేమకు మరణం లేదు.. అది మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడుతుంది..‘ అనే వాక్యాల గురించి హీరోయిన్ ప్రస్తావిస్తే.. తొలిప్రేమ తోపేమీ కాదని హీరో సమాధానం చెబుతూ అందుకు వివరణలు ఇస్తాడు.

అంటే.. ‘బేబి‘కి క్వైట్ ఆపోజిట్ గా మరో కొత్త ప్రేమకథతో ‘చెన్నై లవ్ స్టోరీ‘ రూపొందుతుందని ఈ గ్లింప్స్ తో చెప్పకనే చెప్పారు మేకర్స్. ఈ మూవీకి సాయిరాజేష్ కథ అందిస్తుండగా.. రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నాడు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. తాజాగా ‘చెన్నై లవ్ స్టోరీ‘ షూటింగ్ మొదలు పెట్టుకుంది.


Full View


Tags:    

Similar News