అంచనాలు పెంచుతోన్న ‘కన్నప్ప‘

ఈ వారం ప్రేక్షకులకు భారీ విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘కన్నప్ప‘. మంచు విష్ణు హీరోగా, మోహన్ బాబు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.;

By :  S D R
Update: 2025-06-24 11:34 GMT

ఈ వారం ప్రేక్షకులకు భారీ విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘కన్నప్ప‘. మంచు విష్ణు హీరోగా, మోహన్ బాబు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ చిత్రంపై బిజినెస్ పరంగా ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో సినిమాపై పాజిటివ్ బజ్‌ ఉంది. పాటలు ఇప్పటివరకు బాగానే రీచ్ అయినప్పటికీ, మాస్ లెవెల్‌లో స్పందన పెరగాల్సిన అవసరం ఉంది. భారీ బడ్జెట్ పెట్టుబడి పెట్టిన విష్ణు, ఈ సినిమాతో తన కెరీర్‌ని మళ్లీ నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు.

మరోవైపు ఈ మూవీ నిడివి 3 గంటలకు పైగానే ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ నిడివి ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందన్నది కీలకం. ఇక ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ వంటి భారీ కాస్టింగ్ ఈ సినిమాకు బలమైన మద్దతుగా నిలవనుంది. ముఖ్యంగా ప్రభాస్ స్క్రీన్ టైం కూడా ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది అనే న్యూస్ డార్లింగ్ ఫ్యాన్స్‌ను థియేటర్లకు రప్పించే అంశం.

ప్రపంచవ్యాప్తంగా 5,400 స్క్రీన్లలో ‘కన్నప్ప‘ రిలీజ్ అవుతోంది. రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. ఓ పక్క విమర్శలు, మరోపక్క భారీ అంచనాల మధ్య ‘కన్నప్ప‘ థియేటర్లలో ఎలాంటి రిజల్ట్ సాధించబోతుందో తెలుసుకోవాలంటే జూన్ 27 వరకూ వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News