RC16 గ్లింప్స్‌పై ఆసక్తికర కామెంట్
'రాబిన్‌హుడ్' ప్రమోషన్స్ లో రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న RC16 గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు రవి.;
నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాబిన్‌హుడ్’ మార్చి 28న విడుదలకు సిద్ధంగా ఉంది. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్ ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. నిర్మాత రవిశంకర్ ఈ చిత్రానికి ఎలాంటి పెయిడ్ ప్రీమియర్స్ ఉండబోవని, ప్రేక్షకుల స్పందనపై నమ్మకముందని అన్నారు. ఆసక్తికరంగా, ఈ సినిమాలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా నటించడంతో ప్రేక్షకులలో మరింత ఆసక్తి నెలకొంది.
ఇక 'రాబిన్‌హుడ్' ప్రమోషన్స్ లో రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న RC16 గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు రవి. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ చూశానని, అది ఎంతో ఆకట్టుకుందని రవి తెలిపారు. చిత్రంలోని ప్రత్యేకంగా రూపొందించిన ఓ సన్నివేశం కోసమైనా గ్లింప్స్‌ను ప్రేక్షకులు కనీసం వెయ్యి సార్లు చూస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. RC16 గ్లింప్స్ రేపు చరణ్ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ కానుంది.
మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో పలు భారీ చిత్రాలు 2026లో విడుదల కానున్నాయి. రామ్ చరణ్-బుచ్చిబాబు, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్, ప్రభాస్-హను రాఘవపూడి, రిషబ్ శెట్టి-ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్', విజయ్ దేవరకొండ-రాహుల్ సాంకృత్యన్, పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' వంటి సినిమాలు ఇందులో ఉన్నాయి. ఇక తమిళంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన అజిత్ కుమార్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఈ సినిమా కోలీవుడ్‌లో ఓపెనింగ్ డే రికార్డులు తిరగరాస్తుందని నిర్మాత రవి ధీమా వ్యక్తం చేశారు.