మెగా వారసుడి నుంచి గ్లోబల్ ఐకాన్ వరకు

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా తెరంగేట్రం చేసిన రామ్ చరణ్, తన ప్రత్యేకతతో తెలుగు చిత్రసీమలో అగ్రస్థానాన్ని అధిరోహించాడు.;

By :  S D R
Update: 2025-03-27 01:49 GMT

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా తెరంగేట్రం చేసిన రామ్ చరణ్, తన ప్రత్యేకతతో తెలుగు చిత్రసీమలో అగ్రస్థానాన్ని అధిరోహించాడు. 2007లో 'చిరుత'తో ఎంట్రీ ఇచ్చి, 2009లో 'మగధీర'తో సరికొత్త రికార్డులను సృష్టించాడు. ఈ చిత్రం అతనికి స్టార్ డమ్ ను తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత 'రచ్చ, నాయక్, ఎవడు' వంటి మాస్ ఎంటర్టైనర్స్ తో విజయపథాన్ని కొనసాగించాడు. 'ధృవ'తో కొత్త తరహా పాత్రలను ప్రయత్నించేందుకు ముందుకు వచ్చాడు. 2018లో వచ్చిన 'రంగస్థలం' అతని కెరీర్‌లో మైలురాయి. ఈ సినిమాలో చెవిటి యువకుడి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

2022లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'RRR' తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారాడు. అల్లూరి సీతారామరాజు పాత్రలో అతని నటనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 'RRR' తర్వాత 'ఆచార్య, గేమ్ ఛేంజర్' చిత్రాలతో అలరించలేకపోయిన చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమాని చేస్తున్నాడు. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. ఇక తన 17వ సినిమాని క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తో చేయబోతున్నాడు.

మొత్తంగా మెగాస్టార్ వారసుడిగా కాదు, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్, టాలీవుడ్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

Tags:    

Similar News