'మాస్ జాతర'లో మ్యూజిక్ ధమాకా!
మాస్ మహారాజా రవితేజ నుంచి రాబోతున్న లేటెస్ట్ మూవీ 'మాస్ జాతర'. ఈ సినిమాకి 'మనదే ఇదంతా' అనేది ట్యాగ్ లైన్.;
మాస్ మహారాజా రవితేజ నుంచి రాబోతున్న లేటెస్ట్ మూవీ 'మాస్ జాతర'. ఈ సినిమాకి 'మనదే ఇదంతా' అనేది ట్యాగ్ లైన్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లో రూపొందుతున్న ఈ మూవీకి భాను బోగవరపు దర్శకుడు. విడుదలకు ముస్తాబవుతోన్న 'మాస్ జాతర' నుంచి క్రేజీ అప్డేట్ అందించింది టీమ్.
'మాస్ జాతర' చిత్రం నుంచి ఏప్రిల్ 14న ఫస్ట్ సింగిల్ 'తూ మేరా లవర్' రాబోతుంది. ఈ సందర్భంగా విడుదలైన పోస్టర్‌లో రవితేజ తన ఎనర్జిటిక్ డ్యాన్స్ మోడ్‌లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఈ చిత్రంలో రవితేజాకి జోడీగా శ్రీలీల నటిస్తుంది. ఇప్పటికే ఈ కాంబోలో వచ్చిన 'ధమాకా' మంచి విజయాన్ని సాధించింది. వీరిద్దరికీ తోడు భీమ్స్ మ్యూజిక్. మరోసారి 'మాస్ జాతర'తో ధమాకా పాటల పండగను తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు రవితేజ, శ్రీలీల, భీమ్స్.
ఇప్పటికే విడుదలైన 'మాస్ జాతర' గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా మే 9న ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందన్న అధికారిక ప్రకటన ఉన్నప్పటికీ, తాజా సమాచారం ప్రకారం విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.