గద్దర్ అవార్డుల వివరాలు ప్రకటన!

తెలంగాణ రాష్ట్రంలో సినిమా పరిశ్రమకు గౌరవం దక్కించే ఉద్దేశ్యంతో 14 సంవత్సరాల తర్వాత సినీ అవార్డుల సంబరం జరగనుంది. ఉత్తమ తెలుగు చలనచిత్రాలను సత్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.;

By :  S D R
Update: 2025-05-29 03:12 GMT

తెలంగాణ రాష్ట్రంలో సినిమా పరిశ్రమకు గౌరవం దక్కించే ఉద్దేశ్యంతో 14 సంవత్సరాల తర్వాత సినీ అవార్డుల సంబరం జరగనుంది. ఉత్తమ తెలుగు చలనచిత్రాలను సత్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ జానపద కళాకారుడు, కవి, సామాజిక ఉద్యమకారుడు గద్దర్ పేరిట ఈ అవార్డులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ కార్యక్రమం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రతిభావంతులైన కళాకారులు, సాంకేతిక నిపుణులను గుర్తించి, వారిని గౌరవించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సినిమా రంగంలో ఉత్తమ ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఇప్పటికే సినీ ప్రముఖులు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ అవార్డుల కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రముఖ నటి జయసుధ నేతృత్వంలో ఒక జ్యూరీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సినీ పరిశ్రమలోని ఇతర ప్రముఖులు, సాంకేతిక నిపుణులు, విమర్శకులు కూడా సభ్యులుగా ఉన్నారు.

ఈ రోజు ఉదయం 10 గంటలకు గద్దర్ తెలంగాణ సినిమా అవార్డుల వివరాలను అవార్డుల కమిటీ చైర్మన్ జయసుధ, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ప్రకటించనున్నారు.

Tags:    

Similar News