క్రేజీ మల్టీస్టారర్స్ బాక్సాఫీస్ వార్!
సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ 'కూలీ' రజనీకాంత్ తో పాటు కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళీ స్టార్ సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో మురిపించబోతుంది.;
సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ 'కూలీ' రజనీకాంత్ తో పాటు కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళీ స్టార్ సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో మురిపించబోతుంది. ఇంకా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కూడా కేమియోలో కనిపించనున్నాడనే ప్రచారం ఉంది.
బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా లేటెస్ట్‌గా రిలీజ్ డేట్ కన్ఫమ్ చేసుకుంది. ఆగస్టు 14న ఈ సినిమా విడుదలకాబోతుంది.
మరోవైపు అదే రోజు ఆడియన్స్ ముందుకు రాబోతుంది 'వార్ 2'. 'కూలీ' కంటే ముందే ఆగస్టు 14న హృతిక్ రోషన్-ఎన్టీఆర్ మల్టీస్టారర్ 'వార్ 2' రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. సూపర్ హిట్ మూవీ 'వార్'కి సీక్వెల్ గా వస్తోన్న ఈ చిత్రం యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్‌లో భాగంగా రూపొందుతుంది.
మొత్తంగా ఒకవైపు రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర వంటి సీనియర్స్ క్రేజ్ తో 'కూలీ', మరోవైపు ఎన్టీఆర్ – హృతిక్ మాస్ అప్పీల్ తో 'వార్ 2'.. ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ మామూలుగా ఉండేలా లేదు.