‘వీరమల్లు‘ విడుదలపై మరోసారి క్లారిటీ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు‘ మరోసారి వాయిదా పడబోతుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు‘ మరోసారి వాయిదా పడబోతుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈనేపథ్యంలో మరోసారి ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. మే 9న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో ఎలాంటి సందేహం లేదని నిర్మాత ఎ.ఎమ్.రత్నం స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులైన రీ-రికార్డింగ్, డబ్బింగ్, విజువల్ ఎఫెక్ట్స్.. ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయట. వేసవి కానుకగా ‘హరి హర వీరమల్లు‘ రూపంలో ప్రేక్షకులకు ఓ అద్భుతమైన విజువల్ ఫీస్ట్ అందించబోతున్నామని నిర్మాత హామీ ఇచ్చారు. ‘ఇప్పటికే అనుకున్న ప్రకారం మే 9న ‘హరి హర వీరమల్లు’ విడుదలవుతుంది. మునుపెన్నడూ చూడని స్థాయిలో సినిమాటిక్ అనుభూతిని ఈ చిత్రం అందిస్తుంది‘ అంటూ పవన్ కళ్యాణ్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనుండగా, తొలి భాగం ‘హరి హర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో విడుదల కాబోతుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, నోరా ఫతేహి, బాబీ డియోల్, విక్రమ్ జీత్, జిషు సేన్‌గుప్తా వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.