'ఘాటి' రిలీజ్ డేట్ పై క్లారిటీ!

అందాల అనుష్క శెట్టి, దర్శకుడు క్రిష్ కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్ డ్రామా 'ఘాటి'. ఈ చిత్రంలో అనుష్క గిరిజన ప్రాంతంలో నివసించే ఓ మహిళగా, బాధితురాలిగా మొదలై నేరస్థురాలిగా మారే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది.;

By :  S D R
Update: 2025-06-02 01:24 GMT

అందాల అనుష్క శెట్టి, దర్శకుడు క్రిష్ కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్ డ్రామా 'ఘాటి'. ఈ చిత్రంలో అనుష్క గిరిజన ప్రాంతంలో నివసించే ఓ మహిళగా, బాధితురాలిగా మొదలై నేరస్థురాలిగా మారే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా అసలు ఏప్రిల్ 18న విడుదల తేదీ ఖరారు చేసుకుంది. అయితే విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తి కాలేదన్న కారణంతో సినిమా విడుదల ఆలస్యమయ్యింది.

లేటెస్ట్ గా 'ఘాటి' రిలీజ్ డేట్ ను ప్రకటించబోతున్నారు. ఈ చిత్రం జూలై 11న రాబోతున్నట్టు తెలుస్తోంది. అంటే.. జూలై 4న 'కింగ్డమ్' వచ్చిన వారానికే 'ఘాటి' థియేటర్లలో సందడి చేయనుందన్న మాట. మొత్తానికి ఈ జూన్ నెలంతా వారం వారం పాన్ ఇండియా మూవీస్ థియేటర్లకు క్యూ కట్టబోతున్నాయి. ఇక జూలై నెలలోనూ టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో వరుస సినిమాలు రెడీ అవ్వబోతున్నాయి.

మరోవైపు 'ఘాటి' చిత్రాన్ని నిర్మిస్తున్న యు.వి.క్రియేషన్స్ నుంచే మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' కూడా రెడీ అవుతుంది. అయితే చిరు సినిమా రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రావడం లేదు.

Tags:    

Similar News