చిరు – వెంకీ మాఫియా ఫ్లాష్‌బ్యాక్!
మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ పక్కా ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ సినీ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది.;
మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ పక్కా ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ సినీ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. మాస్, కామెడీ, ఎమోషన్స్‌తో మిక్స్ చేసిన ఈ మూవీలో సెకండ్ హాఫ్‌కు ప్రత్యేక ఆకర్షణగా మాఫియా బ్యాక్‌డ్రాప్ ఉండబోతుందట. అందులో మెగాస్టార్ క్యారెక్టర్ కు ఓ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను డిజైన్ చేశాడట అనిల్ రావిపూడి. ఆ ఫ్లాష్‌బ్యాక్‌లోనే విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నాడని టాక్.
ఈ చిత్రానికి వెంకటేష్ 30 రోజుల డేట్స్ కేటాయించినట్టు సమాచారం. ఇందులో కొన్నిరోజులు మూవీ ప్రమోషన్స్ కోసం కూడా వినియోగించనున్నారని తెలుస్తోంది. చిరు – వెంకీ కాంబో కోసం దర్శకుడు అనిల్ రావిపూడి ప్రత్యేకమైన సెట్‌ను రూపందించాడట. త్వరలో వెంకటేష్ ఎంట్రీకి సంబంధించి ఒక స్పెషల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేయనున్నారన్న టాక్ ఫిలిం నగర్ లో వినిపిస్తోంది.
ఇప్పటికే మెగా 157 రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. త్వరలో థర్డ్ షెడ్యూల్ ని మొదలు పెట్టనున్నారు. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా నయనతార, కేథరిన్ నటిస్తున్నారు. భీమ్స్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వచ్చే సంక్రాంతి కానుకగా మెగా 157 రిలీజ్ కు రెడీ అవుతుంది.