చిరంజీవి-అనిల్ చిత్రం ప్రారంభం!
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'మెగా 157' ప్రారంభమైంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమా ముహూర్తాన్ని జరుపుకుంది.;
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'మెగా 157' ప్రారంభమైంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమా ముహూర్తాన్ని జరుపుకుంది. విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ వేడుకలో అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్, దిల్ రాజు, మైత్రీ అధినేతలు.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి వంటి సినీ ప్రముఖులు హాజరయ్యారు.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి శంకర్ వరప్రసాద్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకి భీమ్స్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారనే ప్రచారం ఉంది. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకోనుంది.