'భైరవం' ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైలైట్స్!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, నారా రోహిత్‌, మంచు మనోజ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'భైరవం' సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఎంతో జోష్‌గా సాగింది. ఈ ఈవెంట్‌లో హీరోలతో పాటు దర్శకులు అనిల్ రావిపూడి, సంపత్ నంది ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.;

By :  S D R
Update: 2025-05-25 17:05 GMT

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, నారా రోహిత్‌, మంచు మనోజ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'భైరవం' సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఎంతో జోష్‌గా సాగింది. ఈ ఈవెంట్‌లో హీరోలతో పాటు దర్శకులు అనిల్ రావిపూడి, సంపత్ నంది ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో మంచు మనోజ్‌ సతీమణి మౌనిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె సుమ అడిగిన ప్రశ్నలకు తనదైన గమ్మత్తైన శైలిలో సమాధానాలు ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

''భైరవం' బ్లాక్‌బస్టర్‌ అవుతుందని నమ్మకం ఉంది' అని మౌనిక చెబుతూ, భర్త మనోజ్‌ గజపతి పాత్రలో అదరగొట్టాడని ప్రశంసించారు. అలాగే, 'ఫ్లై హై' అనే పదాన్ని మనోజ్‌కు డెడికేట్‌ చేస్తూ ఆయన కెరీర్‌ మళ్లీ రాణించాలని ఆకాంక్షించారు.

ఈ ఈవెంట్ లో మంచు మనోజ్‌ గురించి శింబు ఫోన్ కాల్ ద్వారా చెప్పిన మాటలు ఆసక్తిని కలిగించాయి. 'మనోజ్‌ ఒక చిన్న పిల్లాడిలా ఉంటాడు. మీరు ఆయనపై ప్రేమ చూపిస్తే, అతను మరింతగా ప్రేమను చూపిస్తాడు. కానీ కోపం చూపిస్తే, అది మనకే సమస్య అవుతుంది.' అన్నాడు. అలాగే ఈ ఈవెంట్ లో హీరోయిన్లతో కలిసి ‘ఓ వెన్నెల’ పాటకు స్టేజ్‌పై డ్యాన్స్‌ చేసి సందడి చేశాడు మంచు మనోజ్‌.

బెల్లంకొండ శ్రీనివాస్‌ను వేదికపైకి తీసుకెళ్లిన మనోజ్‌ ఓ యాక్షన్‌ సీన్‌ వివరిస్తూ చెప్పగా, 'నువ్వు చేసి చూపిస్తే నేను చేస్తా' అంటూ శ్రీనివాస్‌ చమత్కారంగా స్పందించాడు. ఈ సన్నివేశం ఆహుతులను బాగా నవ్వించింది.

ఈ ఈవెంట్ లో నారా రోహిత్ కాలికి కట్టుతో కనిపించాడు. రోహిత్ గురించి వేసిన స్పెషల్ ఎ.వి. ఆకట్టుకుంది. ఇక దర్శకుడు విజయ్‌ కనకమేడల మెగాస్టార్‌ చిరంజీవి 'ఇంద్ర' సినిమాలోని డైలాగ్‌ను రీక్రియేట్ చేయడం వేడుకలో ఒక హైలైట్‌ అయింది.

Tags:    

Similar News