బెట్టింగ్‌ యాప్స్‌ వివాదం – సినీ ప్రముఖులకు షాక్!

సినీ ప్రముఖులు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు బెట్టింగ్‌ యాప్స్‌కు ప్రచారం కల్పించిన వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.;

By :  S D R
Update: 2025-03-20 06:55 GMT

సినీ ప్రముఖులు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు బెట్టింగ్‌ యాప్స్‌కు ప్రచారం కల్పించిన వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. పంజాగుట్ట, మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే విష్ణుప్రియకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించారు. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రచారంలో ఉన్న 25 మంది వ్యక్తుల జాబితాలో సినీ నటులు, టీవీ యాంకర్లు, సోషల్‌ మీడియా ప్రముఖులు ఉన్నారు.

ప్రముఖుల జాబితాలో రానా దగ్గుబాటి, విజయ్‌ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్‌, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్‌ వంటి పేర్లు ఉండటం సంచలనంగా మారింది. అలాగే, అనన్య నాగళ్ల, శ్రీముఖి, శ్యామల, టేస్టీ తేజ, హర్ష సాయి వంటి ఇన్‌ఫ్లూయెన్సర్లు కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.

ఈ కేసును మియాపూర్‌ వాసి ప్రమోద్‌ శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది, దీనిపై మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.

Tags:    

Similar News