అర్జున్ vs వైజయంతి!

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ ప్రధాన పాత్రలో ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’.;

By :  S D R
Update: 2025-04-12 14:51 GMT

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ ప్రధాన పాత్రలో ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో నటించారు. కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఏప్రిల్ 18న ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ఆడియన్స్ ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రచారంలో దూకుడు పెంచారు మేకర్స్. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఐ.పి.ఎస్. ఆఫీసర్ వైజయంతి క్యారెక్టర్ లో విజయశాంతి నటిస్తే.. ఆమె కొడుకు అర్జున్ పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపిస్తున్నాడు. అయితే గ్యాంగ్‌స్టర్స్ కు సింహ స్వప్నమైన పవర్‌ఫుల్ ఐ.పి.ఎస్ గా వైజయంతి క్యారెక్టర్ ఉంటే.. ఆ గ్యాంగ్‌స్టర్స్ కే నాయకుడిగా అర్జున్ పాత్ర ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

అయితే క్రిమినల్ అయిన అర్జున్.. తన తల్లి గురించి ఎలా మారాడు? దేశాన్ని నాశనం చేయాలనుకునే ఉగ్రవాదులను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది ఈ సినిమా కథగా ట్రైలర్ లో కనిపిస్తుంది. మొత్తంగా తల్లీకొడుకుల అనుబంధాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రంగా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

ఈ సినిమాలో సయీ సయీ మంజ్రేకర్‌ హీరోయిన్ గా నటించగా, సోహైల్ ఖాన్ విలన్ గా కనిపించబోతున్నాడు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.



Full View


Tags:    

Similar News