‘అర్జున్ S/O వైజయంతి’ వసూళ్లు!

కళ్యాణ్ రామ్, విజయశాంతి టైటిల్ రోల్స్ లో కనిపించిన సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి‘. ఏప్రిల్ 18న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజయ్యింది.;

By :  S D R
Update: 2025-04-21 06:59 GMT

కళ్యాణ్ రామ్, విజయశాంతి టైటిల్ రోల్స్ లో కనిపించిన సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి‘. ఏప్రిల్ 18న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజయ్యింది. డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి ఈ సినిమాని తల్లీకొడుకుల సెంటిమెంట్ తో కమర్షియల్ గా డీల్ చేశాడు.

తొలి రోజు నుంచే ఈ మూవీకి ఎక్కువగా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. మరోవైపు ఈ చిత్రం విడుదలైన మూడు రోజులకు రూ.12.85 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించింది. ఎమోషనల్ బ్లాక్ బస్టర్ గా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి‘ నిలిచిందని.. వీకెండ్ లోనే కాదు, వీక్ డేస్ లో కూడా సినిమా బాగా పుంజుకుంటుందని చెబుతోంది టీమ్.

మొత్తంగా.. కలెక్షన్ల పరంగా ఇది కళ్యాణ్ రామ్ స్థాయికి తక్కువగానే కనిపించినా, లాంగ్ రన్ లో మరింత మెరుగ్గా వసూళ్లు సాధిస్తుందేమో చూడాలి.



Tags:    

Similar News