ఏపీ శాసన సభ 11వ రోజు సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం
ఏపీ శాసన సభ 11వ రోజు సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం
- ఏపీ శాసన మండలి పదవ రోజు సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం
- ఉభయ సభలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం
- ఉభయ సభల్లో ఆయా శాఖల బడ్జెట్ పద్దులపై చర్చ - ఆమోదం
- 2024 ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల పట్టాదారు పాసు పుస్తకము సవరణ బిల్లును సభలో ప్రవేశ పెట్టనున్న రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్.
- శాసన సభలో టిడ్కో ఇళ్ల లబ్దిదారుల మార్పు...రాష్ట్రంలో వలసలు...బిల్లుల చెల్లింపులో అక్రమాలు, ఆంధ్ర విశ్వ విద్యాలయాలలో అక్రమాలు..విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు తదితర అంశాలపై ప్రశ్నోత్తరాలు
- ఇంధన రంగంపై శాసన సభలో లఘు చర్చ
- శాసన మండలిలో సామాజిక భద్రత పింఛన్లు.. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు.. పర్మిట్ రూములకు అనుమతి ..పీడీఎఫ్ బియ్యం అక్రమ అమ్మకం..జగనన్న కాలనీల్లో అక్రమాలు..నూతన పర్యాటక విధానం తదితర అంశాలపై ప్రశ్నోత్తరాలు
- 2019- 2024 మధ్య జరిగిన కుంభకోణాలు పై శాసన మండలిలో లఘు చర్చ.