ప్రభాస్ కిట్టీలో మరో ప్రాజెక్ట్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అరడజను సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో ఏ ఏ చిత్రాలు ఎప్పుడు వస్తాయో అనేదానిపై క్లారిటీ లేదు.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అరడజను సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో ఏ ఏ చిత్రాలు ఎప్పుడు వస్తాయో అనేదానిపై క్లారిటీ లేదు. అయినా కొత్త సినిమాలకు కమిట్ అవుతూనే ఉన్నాడు డార్లింగ్. లేటెస్ట్ గా రెబెల్ స్టార్ కిట్టీలో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరిందట.
ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ' సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే.. హను రాఘవపూడితో మరో మూవీకి కమిట్ అయ్యాడట. 'ఫౌజీ' చిత్రీకరణ సమయంలో హను రాఘవపూడి వర్కింగ్ స్టైల్ ప్రభాస్‌కు బాగా నచ్చడంతో, మరో సినిమాకు ముందుగానే ప్లాన్ చేసినట్లు సమాచారం. అంతేకాదు, ఈ కొత్త ప్రాజెక్ట్ కోసం ఓ అగ్ర నిర్మాత ద్వారా హనుకు అడ్వాన్స్ కూడా ఇప్పించాడని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
మరోవైపు ప్రభాస్ ఈనెలలో 'రాజా సాబ్' కోసం కొన్ని డేట్స్ కేటాయించాడట. విదేశాల నుంచి వచ్చిన తర్వాత 'రాజా సాబ్' షూట్‌లో పాల్గొంటాడట. ఇక 'ఫౌజీ' ఇప్పటికే చిత్రీకరణ దశలో ఉండగా త్వరలో సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్'ని షురూ చేస్తాడు. ఆ తర్వాత 'సలార్ 2, కల్కి 2' లైన్లో ఉన్నాయి. ఇంకా ప్రశాంత్ వర్మ తో 'బ్రహ్మరాక్షస్', లోకేష్ కనకరాజ్ తో మరో మూవీ కూడా లైన్లో ఉన్నాయి.