మోహన్ బాబు యూనివర్శిటీపై ఆరోపణలు.. విష్ణు స్పందన

మోహన్ బాబు యూనివర్శిటీపై అధిక ఫీజులు, హాజరు అవకతవకలు, సర్టిఫికెట్ల నిలుపుదల వంటి అంశాలపై చర్చ జరుగుతుంది.;

By :  S D R
Update: 2025-10-08 09:35 GMT

మోహన్ బాబు యూనివర్శిటీపై అధిక ఫీజులు, హాజరు అవకతవకలు, సర్టిఫికెట్ల నిలుపుదల వంటి అంశాలపై చర్చ జరుగుతుంది. ఈనేపథ్యంలో ఉన్నత విద్య నియంత్రణ కమిషన్ (APHERMC) చేసిన సిఫార్సులపై మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. ఈ వార్తలపై యూనివర్శిటీ ప్రో-ఛాన్సలర్ మంచు విష్ణు స్పందించారు. ఈ సిఫార్సులు కేవలం సూచనలు మాత్రమేనని, ఆ విషయం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణలో ఉందని ఆయన స్పష్టం చేశారు.

“APHERMC చేసిన సిఫార్సులకు వ్యతిరేకంగా హైకోర్టు మోహన్ బాబు యూనివర్శిటీకి అనుకూలంగా స్టే ఆదేశాలు జారీ చేసింది. అయినా కూడా కమిషన్ ఆ వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచడం దురదృష్టకరం. మా విశ్వవిద్యాలయం ఎలాంటి తప్పు చేయలేదని, విచారణ సమయంలో కమిషన్‌కు పూర్తి సహకారం అందించిందని వారి నివేదికలోనే స్పష్టంగా ఉంది” అని విష్ణు తెలిపారు.

విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొన్ని వర్గాలు నిరాధారమైన వార్తలను ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఇటువంటి వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. మోహన్ బాబు యూనివర్శిటీ దేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థలలో ఒకటిగా ఎదుగుతుందని, పెన్ స్టేట్, RWTH ఆకెన్, విస్కాన్సిన్ వంటి అంతర్జాతీయ యూనివర్శిటీలతో భాగస్వామ్యాలు కొనసాగిస్తున్నామని విష్ణు చెప్పారు.

Tags:    

Similar News