రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై అలీ స్పందన
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా గుర్తింపు పొందిన రాజేంద్రప్రసాద్ ఇటీవల మరో వివాదంలో చిక్కుకున్నాడు.;
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా గుర్తింపు పొందిన రాజేంద్రప్రసాద్ ఇటీవల మరో వివాదంలో చిక్కుకున్నాడు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా ఆలీపై వాడిన అసభ్య పదజాలం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
ఆ వేడుకల సందర్భంగా రాజేంద్రప్రసాద్ చేసిన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలు – ఆలీగాడు ఎక్కడ ఉన్నాడు లం*కొడుకు" వంటి పదాలు – శ్రోతలలో ఆశ్చర్యం, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఇది సాధారణంగా చెప్పే వెటకారం కాదు, అసభ్యతతో కూడిన వ్యాఖ్యలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
గతంలో ‘రాబిన్ హుడ్’ చిత్రం ప్రమోషన్‌లో క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ సందర్భంలో క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్, ఇప్పుడు మళ్లీ ఆలీ విషయంలో ఇలాంటి అభ్యంతరకర పదజాలంతో వార్తల్లో నిలవడం పట్ల ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలావుంటే.. తనపై రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యల పట్ల అలీ స్పందించాడు. రాజేంద్రప్రసాద్ పెద్దవారు, కూతురు చనిపోయిన దు:ఖంలో ఉన్నారు. ఆయన నుంచి ఏదో అనుకోకుండా ఆ మాట తూలింది. దీన్ని మీడియా పెద్దది చేయొద్దని అని అలీ అన్నాడు.