అజిత్ మాస్ ర్యాంపేజ్ స్టార్ట్!
కోలీవుడ్ అల్టిమేట్ స్టార్ తల అజిత్ మాస్ ర్యాంపేజ్ షురూ అయ్యింది. అజిత్ మోస్ట్ అవైటింగ్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' నుంచి ట్రైలర్ వచ్చేసింది.;
కోలీవుడ్ అల్టిమేట్ స్టార్ తల అజిత్ మాస్ ర్యాంపేజ్ షురూ అయ్యింది. అజిత్ మోస్ట్ అవైటింగ్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' నుంచి ట్రైలర్ వచ్చేసింది. రెండు నిమిషాల నిడివితో వచ్చిన ఈ ట్రైలర్ ఆద్యంతం అజిత్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఫ్యాన్స్ కు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. ట్రైలర్ లో అజిత్ డిఫరెంట్ గెటప్స్ లో సందడి చేస్తున్నాడు. ఒక క్యారెక్టర్ కోసం స్లిమ్ లుక్ లోనూ మెస్మరైజ్ చేస్తున్నాడు.
అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో త్రిష కృష్ణన్, సిమ్రాన్, సునీల్, యోగి బాబు, ప్రసన్న, ప్రభు, ప్రియా ప్రకాష్, జాకీ ష్రాఫ్, అర్జున్ దాస్ వంటి భారీ తారాగణం చిత్రంలో నటించింది. జి.వి.ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రస్తుతానికైతే ఈ చిత్రాన్ని ఎక్కువగా తమిళంలోనే ప్రమోట్ చేస్తున్నారు. తెలుగులోనూ ఈ సినిమాని భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది మైత్రీ సంస్థ.