'దేవర' సీక్వెల్ లో అదనపు ట్విస్టులు?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' ఘన విజయాన్ని సాధించింది. రీసెంట్ గా ఈ మూవీ జపాన్ లోనూ విడుదలైంది. జపాన్ లో 'దేవర'ను ప్రమోట్ చేయడానికి ప్రత్యేకంగా హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ వెళ్లారు. జపాన్ ఆడియన్స్ 'దేవర'ను బాగా రిసీవ్ చేసుకుంటున్నారు.;
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' ఘన విజయాన్ని సాధించింది. రీసెంట్ గా ఈ మూవీ జపాన్ లోనూ విడుదలైంది. జపాన్ లో 'దేవర'ను ప్రమోట్ చేయడానికి ప్రత్యేకంగా హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ వెళ్లారు. జపాన్ ఆడియన్స్ 'దేవర'ను బాగా రిసీవ్ చేసుకుంటున్నారు.
ఇదే సమయంలో 'దేవర' సెకండ్ పార్ట్ గురించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. కొరటాల శివ ఇప్పటికే 'దేవర 2'కి సంబంధించి ఫస్ట్ డ్రాఫ్ట్ రెడీ చేశాడట. ఈసారి ఈ చిత్రంలో పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని అంశాలను జోడించనున్నట్టు తెలుస్తోంది. మొదటి భాగంలో ఉన్న నటీనటులతో పాటు.. మరికొంతమంది కొత్త నటీనటులు కూడా సీక్వెల్ లో సందడి చేయనున్నారట.
మరోవైపు ఇప్పటికే 'వార్ 2'ని ఫినిషింగ్ స్టేజ్‌కు తీసుకొచ్చిన తారక్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత 'దేవర 2'ని పట్టాలెక్కిస్తాడు. మొత్తంగా.. ఆగిపోయిందనుకున్న 'దేవర 2'పై మళ్లీ కదలిక వచ్చిందన్నమాట. ఫస్ట్ పార్ట్ తో పాన్ ఇండియా లెవెల్ లో రూ.500 కోట్లు వసూళ్లను కొల్లగొట్టిన ఎన్టీఆర్.. సెకండ్ పార్ట్ తో సరికొత్త కలెక్షన్ల రికార్డులను సృష్టిస్తాడేమో చూడాలి.