సరికొత్త హెయిర్ స్టైల్ తో షాకివ్వబోతున్న శోభిత !

"నన్ను పూర్తిగా హెయిర్ కట్ చేయించుకోమంటారా?" అనే సరదా పోల్‌ను నిర్వహిస్తూ... ఆమెకు తన జుట్టును పూర్తిగా కత్తిరించే ఆలోచనలో ఉందని సూచించింది.;

By :  K R K
Update: 2025-03-29 05:58 GMT

ఫ్యాషన్ ప్రియులను మంత్రముగ్ధుల్ని చేసే విషయంలో శోభిత ధూళిపాళ ఎప్పుడూ ముందుంటుంది. అయితే.. ఈసారి ఆమె దుస్తులకన్నా ఆమె హెయిర్ స్టైల్ గురించే ఎక్కువ చర్చ నడుస్తోంది. ఇటీవల అక్కినేని నాగ చైతన్యను వివాహం చేసుకున్న శోభిత తాజాగా.. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన ఒక క్రిప్టిక్ మెసేజ్‌తో అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.

"నన్ను పూర్తిగా హెయిర్ కట్ చేయించుకోమంటారా?" అనే సరదా పోల్‌ను నిర్వహిస్తూ... ఆమెకు తన జుట్టును పూర్తిగా కత్తిరించే ఆలోచనలో ఉందని సూచించింది. దీనిని చూసిన అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఇది వేసవి మేకోవర్‌లో భాగమా? లేకపోతే కొత్త సినిమా కోసం ఆమె తీసుకున్న నిర్ణయమా? లేక కేవలం ఓ సోషల్ మీడియా స్టంట్ మాత్రమేనా? అనేక అనుమానాలు అభిమానులను వెంటాడుతున్నాయి.

అయితే... పూర్తిగా గుండు చేయించుకోవడం అనేది కొంచెం ఆడ్ గా అనిపించినా.. శోభిత ఎప్పుడూ తన ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్‌లో డేరింగ్ నిర్ణయాలే తీసుకుంటుంది. తను చిన్నగా కత్తిరించినా.. గట్టిగా ట్రిమ్ చేసుకున్నా, లేక మరింత విభిన్నమైన లుక్‌ను ఎంచుకున్నా.. ఒక విషయం మాత్రం ఖచ్చితం... తన స్టైల్‌తో అభిమానులను ఆశ్చర్యపరచడంలో ఆమె ఎప్పుడూ ముందుంటుంది.

Tags:    

Similar News