సమంత - రాజ్ నిడమోరు ... ఇది నిజమేనా?
ఒక ఫోటోలో సమంత రాజ్ చేతిని పట్టుకుని ఉండటం చూసిన నెటిజన్లు వీరి మధ్య నిజంగా ఏదైనా రిలేషన్ ఉందా? అనే చర్చ మొదలైంది.;
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న అనేక పరిణామాల కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. గతంలో సహ నటుడు నాగచైతన్యను వివాహం చేసుకుని, అనంతరం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత, ఆమె తన వ్యక్తిగత బాధలను సోషల్ మీడియాలో పంచుకుంది. అంతేకాదు, ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంది. మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడిన ఆమె, దీని నుంచి నెమ్మదిగా కోలుకుంటోంది.
ఇదిలా ఉంటే.. ఇటీవల సమంత గురించి మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె ‘సిటాడల్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమయంలో.. ఆ సిరీస్ కు దర్శకత్వం వహించిన రాజ్ నిడుమోరుతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై రాజ్ గానీ, సమంత గానీ స్పందించలేదు. అదే సమయంలో.. వీరు ఈ వార్తలను ఖండించకపోవడంతో అనుమానాలు మరింత ముదిరాయి.
తాజాగా సమంత పికిల్ బాల్ అనే స్పోర్ట్స్ టీం కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా, అందులో రాజ్ నిడుమోరు కూడా కనిపించడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఒక ఫోటోలో సమంత రాజ్ చేతిని పట్టుకుని ఉండటం చూసిన నెటిజన్లు వీరి మధ్య నిజంగా ఏదైనా రిలేషన్ ఉందా? అనే చర్చ మొదలైంది. అదే సమయంలో, సమంత-నాగచైతన్య విడాకుల సమయంలో రాజ్ డీకే డైరెక్ట్ చేసిన 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. ఈ కారణంగా, అప్పటినుంచి సమంత రాజ్‌తో ప్రేమలో పడిందనే వదంతులు మరింత బలపడు తున్నాయి. మరి దానికి వీళ్ళ స్పందన ఎలా ఉండబోతోందో చూడాలి.