'సంక్రాంతికి వస్తున్నాం'.. టీవీ ప్రీమియర్ పై భారీ అంచనాలు!

Update: 2025-02-28 05:43 GMT

విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్‌బస్టర్ సాధించింది. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి వెంకటేష్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నమోదైంది.



థియేటర్లలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ కంటే ముందే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. జీతెలుగు ఛానెల్ ఈ సినిమాని మార్చి 1న సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక థియేట్రికల్ రిలీజ్ సమయంలో ఈ సినిమాని ఓ రేంజులో ప్రమోట్ చేసిన టీమ్ ఇప్పుడు టెలివిజన్ ప్రీమియర్ కోసమూ ప్రచారాన్ని మొదలు పెట్టారు.

'సంక్రాంతికి వస్తున్నాం' బుల్లితెరపై సందడి చేయబోతున్న సందర్భంగా ఈ సినిమాని అందరూ వీక్షించాల్సిందిగా వెంకటేష్, అనిల్ రావిపూడి చెబుతున్న వీడియోని రిలీజ్ చేసింది జీ తెలుగు. మొత్తంగా.. వెండితెరపై వసూళ్ల రికార్డులు సృష్టించిన 'సంక్రాంతికి వస్తున్నాం'.. బుల్లితెరపై టి.ఆర్.పి. రేటింగ్స్ ల పరంగా ఎలాంటి సంచనాలు సాధిస్తుందో చూడాలి

Tags:    

Similar News