జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి

ప్రెజెంట్ మన స్టార్స్ ఓన్లీ సిల్వర్ స్క్రీన్ పైనే కాకుండా స్మాల్ స్క్రీన్, ఓటీటీ లలోనూ అదరగొడుతున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, ఎన్టీఆర్, రానా, నాని వంటి వారు పలు రియాలిటీ షో లకు హోస్టులుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.;

By :  S D R
Update: 2025-06-29 14:41 GMT

ప్రెజెంట్ మన స్టార్స్ ఓన్లీ సిల్వర్ స్క్రీన్ పైనే కాకుండా స్మాల్ స్క్రీన్, ఓటీటీ లలోనూ అదరగొడుతున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, ఎన్టీఆర్, రానా, నాని వంటి వారు పలు రియాలిటీ షో లకు హోస్టులుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్టులోకి మ్యాన్లీ స్టార్ జగపతిబాబు కూడా చేరబోతున్నాడు. ప్రతిష్ఠాత్మక వైజయంతీ మూవీస్ తమ వైజయంతి టెలివిజన్ పై 'జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి' అంటూ జీ నెట్‌వర్క్‌ కోసం ఓ షో ని తీసుకొస్తుంది. లేటెస్ట్ గా అందుకు సంబంధించి ప్రోమో రిలీజయ్యింది.

పలువురు సెలబ్రిటీల ఇంటర్యూలతో ఈ షో కొనసాగబోతున్నట్టు ఈ ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఈ నాన్‌ ఫిక్షన్ షో లో పలువురు సెలబ్రిటీలు తమ జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల నుంచి అత్యున్నత శిఖరాలు చేరుకున్నారు అనే విషయాలను ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేస్తుందట వైజయంతి టెలివిజన్. త్వరలో 'జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి' జీ నెట్‌వర్క్‌లో అందుబాటులోకి రానుంది.


Full View


Tags:    

Similar News