'బిగ్ బాస్' మళ్లీ వచ్చేస్తున్నాడు!

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్' మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం, త్వరలో సీజన్ 9 తో అలరించడానికి రెడీ అవుతుంది.;

By :  S D R
Update: 2025-06-27 00:54 GMT

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్' మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం, త్వరలో సీజన్ 9 తో అలరించడానికి రెడీ అవుతుంది. లేటెస్ట్ గా రిలీజైన ప్రోమో వీడియోలో హోస్ట్ నాగార్జున మరింత యంగ్ లుక్‌లో దర్శనమిచ్చాడు. 'ఈసారి చదరంగం కాదు... రణరంగమే' అంటూ ఆయన చెప్పిన డైలాగ్‌ షోకి ఉన్న స్థాయిని తెలియజేసింది.

ఇప్పటివరకు హోస్ట్ మారుతాడేమో అనే ఊహాగానాలు వెలువడ్డా.. లేటెస్ట్ ప్రోమోతో నాగార్జునే ఈ సీజన్‌కూ వ్యాఖ్యాతగా కొనసాగుతారని స్పష్టమైంది. ఎన్టీఆర్, నాని తర్వాత మూడో సీజన్ నుంచి వరుసగా నాగార్జునే షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

ప్రోమోలో నాగార్జున చేసిన వ్యాఖ్యల ప్రకారం, ఈసారి టాస్కులు మరింత కఠినంగా ఉండే సూచనలు ఉన్నాయి. గెలుపు కోసం కేవలం పోరాడటం కాదు.. ప్రభంజనం సృష్టించాల్సిన అవసరం ఉందని చెప్పడమే ఇందుకు నిదర్శనం.

సోషల్ మీడియాలో ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టనున్న కంటెస్టెంట్ల పేర్లు వైరల్ అవుతున్నాయి. వీరిలో బమ్ చిక్ బబ్లూ, చిట్టీ పికిల్స్ అలేఖ్య చిట్టి, కల్పిక గణేష్, యాక్టర్ సాయి కిరణ్, నటి జ్యోతి రాయ్, రీతు చౌదరి, సీరియల్ నటుడు శివకుమార్, కావ్య, 'బ్రహ్మముడి' ఫేమ్ దీపిక, నవ్యస్వామి, ఇమాన్యుయేల్, తేజస్విని గౌడ, హీరో సుమంత్ అశ్విన్ వంటి వారు ప్రధానంగా ప్రచారంలో ఉన్నారు.


Full View


Tags:    

Similar News