బిగ్ బాస్ కోసం అగ్నిపరీక్ష

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే ఎనిమిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. తాజాగా తొమ్మిదవ సీజన్‌కి సిద్ధమవుతోంది.;

By :  S D R
Update: 2025-07-25 09:51 GMT

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే ఎనిమిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. తాజాగా తొమ్మిదవ సీజన్‌కి సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి బిగ్ బాస్ 9 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసారి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.

ఇప్పటికే ‘బిగ్ బాస్ 9‘కి సంబంధించి ప్రమోషనల్ యాక్టివిటీస్ మొదలయ్యాయి. ఈసారి కార్యక్రమం మరింత ఉత్సాహభరితంగా, కఠినమైన టాస్కులతో ఉండబోతోందని ప్రచార ప్రోమోలలో స్పష్టం చేసింది టీమ్. ‘ఇది చదరంగం కాదు.. రణరంగం!‘ అంటూ గెలవాలంటే యుద్ధమే అనిపించేలా ఈ సీజన్ ఉండబోతోందని ప్రోమోలతో హింట్ ఇచ్చారు.

ఈసారి ప్రత్యేకత ఏమిటంటే, షోలో కామన్ మ్యాన్ ఎంట్రీకి అవకాశం కల్పించారు. కాల్ ఫర్ ఎంట్రీస్ ద్వారా వచ్చిన లక్షల సంఖ్యలో దరఖాస్తుల నుంచి కేవలం 40 మందిని ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. లేటెస్ట్ గా రిలీజైన ‘అగ్నిపరీక్ష‘ ప్రోమోలో, ఈ 40 మందికి కఠినమైన పరీక్షల ద్వారా చివరికి ఎవరు హౌస్‌లోకి ప్రవేశిస్తారో తేలనుందని తెలిపారు.

మొత్తంగా.. ఈ 40 మంది కామన్ ఎంట్రీలలో ఎవరు ఫైనల్‌గా హౌస్‌లోకి అడుగుపెడతారు? ఏ ఏ సెలబ్రిటీలు ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో కనిపించబోతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సెప్టెంబర్ 7 వరకు ఎదురుచూడాల్సిందే!

Full View


Tags:    

Similar News