బిగ్‌బాస్ 9 లో డబుల్ ఎలిమినేషన్ సెన్సేషన్ !
బిగ్‌బాస్ 9’ సీజన్ ముందుకు సాగే కొద్దీ ఆటలో టెన్షన్, ట్విస్టులు పెరుగుతున్నాయి. తాజా ఎపిసోడ్‌లో డబుల్ ఎలిమినేషన్ జరగడంతో హౌస్‌లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి.;
‘బిగ్‌బాస్ 9’ సీజన్ ముందుకు సాగే కొద్దీ ఆటలో టెన్షన్, ట్విస్టులు పెరుగుతున్నాయి. తాజా ఎపిసోడ్‌లో డబుల్ ఎలిమినేషన్ జరగడంతో హౌస్‌లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. సెలబ్రిటీ కేటగిరీ నుంచి హౌస్‌లోకి అడుగుపెట్టిన నటి ఫ్లోరా షైనీ ఈ వారం ఎలిమినేట్ అయ్యారు. వీడ్కోలు చెప్పేముందు ఆమె తన అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించారు. సంజన, దివ్య, ఇమ్మాన్యుయేల్, శ్రీజలను తాను “లైక్” చేస్తానని చెప్పిన ఫ్లోరా, భరణి, తనూజలను మాత్రం “అన్‌లైక్” చేసినట్టు తెలిపారు. సుమన్‌శెట్టి గురించి అడిగినప్పుడు మాత్రం ఆమె స్పందన మిశ్రమంగా కనిపించింది.
డబుల్ ఎలిమినేషన్‌లో మరో కంటెస్టెంట్ దమ్ము శ్రీజ కూడా ఆట నుంచి బయటికెళ్లారు. దీంతో హౌస్‌లోని సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారాయి. కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ రియాల్టీ షోలో ఈసారి కామనర్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. సామాన్యుల కేటగిరీ నుంచి హౌస్‌లోకి వచ్చిన మనీశ్ మర్యాద, ప్రియాశెట్టి, హరిత హరీశ్ ఇప్పటికే ఎలిమినేషన్‌లో భాగంగా గేమ్ నుంచి తప్పుకున్నారు.
అదే సమయంలో, హౌస్‌లోకి వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు కూడా జోరందుకున్నాయి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ రమ్య మోక్ష, అలాగే దివ్వెల మాధురి ఎంట్రీ ఇవ్వనున్నట్టు గత వారం నుంచే ప్రచారం సాగింది. ఇప్పుడు వీరితో పాటు శ్రీనివాస్ సాయి, నిఖిల్ నాయర్, గౌరవ్, ఆయేషాలు కూడా హౌస్‌లోకి అడుగుపెట్టారు. కొత్త ఎంట్రీలు, పాత కంటెస్టెంట్ల మధ్య జట్టు మార్పులు, స్నేహాలు, విభేదాలు... ఇలా గేమ్ మరింత ఎగ్జైటింగ్‌గా మారుతున్న నేపథ్యంలో రాబోయే ఎపిసోడ్‌లు ప్రేక్షకులను బిగ్‌బాస్ హౌస్ తో కట్టిపడేయడం ఖాయం.