సామాన్యులకు సువర్ణావకాశం!

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో లలో 'బిగ్‌బాస్' ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ షో త్వరలో తొమ్మిదో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.;

By :  S D R
Update: 2025-06-29 14:05 GMT

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో లలో 'బిగ్‌బాస్' ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ షో త్వరలో తొమ్మిదో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. గత కొన్ని సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన కింగ్ నాగార్జున ఈసారి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడు. 'ఇది చదరంగం కాదు.. రణరంగం!' అంటూ ఇప్పటికే నాగ్ ప్రోమోలో చెప్పిన పంచ్ డైలాగ్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఇక ఈ సీజన్ ప్రత్యేకత ఏంటంటే.. ఇప్పటివరకు సెలబ్రిటీలు, టీవీ ఆర్టిస్టులు, సోషల్ మీడియాలోని ఫేమస్ సెలబ్రిటీలకే హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తూ వచ్చిన 'బిగ్‌బాస్' టీమ్, ఈసారి సాధారణ ప్రేక్షకులకు కూడా అవకాశమిస్తూ గ్రాండ్ అప్డేట్ ఇచ్చింది. దీనికి ‘రిటర్న్ గిఫ్ట్’ అనే టైటిల్‌తో స్టార్ మా ప్రోమో కూడా రిలీజ్ చేసింది.

'బిగ్‌బాస్' సీజన్ 9లో పాల్గొనాలనుకునే వారు bb9.jiostar.com వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని, 'మీరు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు?' అనే విషయంపై 3 నిమిషాల వీడియో అప్‌లోడ్ చేయాలి. ఎంపికైనవారికి 'బిగ్‌బాస్‌' హౌస్‌లో ఎంట్రీ లభిస్తుంది.

గతంలో పల్లవి ప్రశాంత్, నూతన నాయుడు లాంటి సామాన్యులు 'బిగ్‌బాస్' హౌస్‌లోకి వచ్చి మంచి గుర్తింపు పొందిన ఉదాహరణలు ఉన్నాయి. ఈసారి మరింత మందికి ఆ అవకాశాన్ని కల్పిస్తూ 'బిగ్‌బాస్ 9' టీమ్ ముందుకొచ్చింది.


Full View


Tags:    

Similar News