క్రేజీ కన్నడ రియాలిటీ షోకి గుడ్ బై చెప్పిన సుదీప్ !
కన్నడలో బిగ్ బాస్ రియాలిటీ షోకు కిచ్చా సుదీప్ గత 11 సీజన్లుగా హోస్టింగ్ చేస్తూ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.;
కొన్నిసార్లు టీవీ కార్యక్రమాలు సినిమాలను మించి విశేష ఆదరణ పొందుతాయి. పలు రియాలిటీ షోల హోస్ట్లుగా ప్రముఖ నటులు వ్యవహరిస్తారు. అలాంటి వారిలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఒకరు. కన్నడలో బిగ్ బాస్ రియాలిటీ షోకు కిచ్చా సుదీప్ గత 11 సీజన్లుగా హోస్టింగ్ చేస్తూ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తాజాగా ఆయన ఈ షోకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు సుదీప్. 11 సీజన్లుగా తనపై చూపించిన అభిమానానికి, ప్రేమకు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ షో హోస్టింగ్ అనుభవం తన జీవితంలో మరిచిపోలేని ఒక అందమైన ప్రయాణమని సుదీప్ చెప్పారు.
సుదీప్ హోస్టింగ్ నుంచి వైదొలగడం అభిమానుల్లో ఆవేదనకు గురిచేసింది. మరిన్ని సీజన్లకు హోస్ట్‌గా ఉంటారని అనుకున్న తమ ఆశలు అడియాసలుగా మారాయని కొందరు అంటున్నారు. అయితే, ఈ నిర్ణయం తన వ్యక్తిగత జీవితానికి, సినిమాలపై మరింత దృష్టి సారించడానికేనని అభిమానులు అర్థం చేసుకుంటున్నారు. టీవీ షోలతోపాటు సినిమాలపైనా కిచ్చా సుదీప్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇటీవల విడుదలైన "మ్యాక్స్" సినిమా ఘన విజయాన్ని సాధించడంతో ఆయన పట్ల ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. బిగ్ బాస్ షోకు గుడ్ బై చెప్పిన తర్వాత ఆయన మరిన్ని సినిమాలు చేసి పెద్ద విజయాలు సాధిస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
బిగ్ బాస్ షో హోస్టింగ్ తన జీవితంలో ప్రత్యేకమైన అనుభవంగా నిలిచిపోతుందని సుదీప్ భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తన శక్తి కొలదీ న్యాయం చేశాననే సంతృప్తి ఆయన మాటల్లో కనపడింది. ఈ అవకాశం తనకు ఇచ్చిన అందరికీ, తన ప్రయాణంలో తోడుగా ఉన్న అభిమానులందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కిచ్చా సుదీప్ ఈ నిర్ణయం తీసుకోవడం అభిమానుల్లో కొన్ని ప్రశ్నలను రేపుతున్నప్పటికీ, ఆయన సినిమాల్లో మరిన్ని విజయాలు సాధించాలని అందరూ కోరుకుంటున్నారు.