బంగారుపాళ్యంలో వైఎస్ జగన్‌ పర్యట - నిబంధనలు ఉల్లంఘనపై ఎస్పీ సీరియస్

జగన్ పర్యటనతో పెరిగిన మామిడి ధరల రాజకీయ వేడి – అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం;

Update: 2025-07-09 13:16 GMT

బంగారుపాళ్యంలో వై ఎస్ జగన్ పర్యటనలో భాగంగా జిల్లా ఎస్పీ షరతులుతో కూడిన అనుమతిని ఇచ్చారు.కానీ అడుగడుగునా పోలిసుల నియమాలను ఉల్లంగిస్తూ జగన్ మరోసారి తన ఆధిపత్యాన్ని నిరూపించుకొనే ప్రయత్నం చేసారు.షరతులను ఉల్లంఘించారు అని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిను పోలీసులు బంగారుపాళ్యం వద్ద అడ్డుకున్నారు. అక్కడ జరిగిన ఘర్షణలో గాయపడిన పార్టీ కార్యకర్తను పరామర్శించేందుకు ఆయన కాన్వాయ్‌ నుంచి దిగేందుకు ప్రయత్నించారు. జిల్లా ఎస్పీ ప్రత్యక్షంగా జోక్యం చేసుకొని, ఆయనను వాహనం నుంచి దిగనివ్వకుండా కట్టడి చేశారు.

పార్టీ కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారనే సమాచారం అందిన వెంటనే జగన్ అక్కడకు చేరుకుని వ్యక్తిగతంగా పరామర్శించాలనుకున్నారు. కానీ, పోలీసులు జగన్‌కు అనుమతినివ్వక, చివరకు కాన్వాయ్‌లోకి మళ్లీ పంపించి పర్యటన కొనసాగించాల్సిందేనన్న ఒత్తిడి తీసుకువచ్చారు.ఈ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ప్రజలతో మమేకమవ్వాలనుకునే నాయకుడిని ఇలా అడ్డుకోవడం ఏమిటి? అంటూ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

వైస్ జగన్ బంగారుపాళ్యం మామిడి మార్కెట్ లోని రైతులను పరామర్శించి వాళ్ళ కష్టాలని తెలుసుకున్నారు. జగన్ మాట్లాడుతూ, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో మామిడి పంటకు గిట్టుబాటు ధర లభించేది అన్నారు. కొనుగోలు కేంద్రాలు ముందుగానే ఏర్పాటు చేసి, మార్కెట్ హామీ కల్పించి రైతులకు భరోసా ఇచ్చేది అని గుర్తు చేసారు.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రైతుల పరిస్థితి దయనీయంగా మారిపోయింది అని విమర్శించారు. మార్కెట్‌లు స్పందించకపోవడంతో, కేజీ మామిడి కేవలం రూ.2కి కూడా అమ్మకాలు జరుగుతున్నాయి అని తీవ్రంగా నష్టపోతున్న రైతులు కన్నీళ్లు కారుస్తున్నారు ఆవేదన చెందారు వైస్ జగన్.

ఇదే సమయంలో కర్ణాటకలో కేంద్ర ప్రభుత్వం కేజీ మామిడిని రూ.16కు కొనుగోలు చేస్తోంది అని అక్కడి రైతులకు భరోసా ఇస్తున్న కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రైతుల పట్ల నిర్లక్ష్యం వహించడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి అన్నారు.

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే స్పందించి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే మామిడి రైతులే కాదు, రాష్ట్ర వ్యవసాయ రంగం మొత్తం ప్రమాదంలో పడే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది అని హెచ్చరించారు వైసీపీ అధ్యక్షులు జగన్.

జగన్ పర్యటనలో భాగంగా కొంతమంది రైతులు రెండు ట్రాక్టర్ల మామిడికాయలను రోడ్డు మీద వేసి వాహనాలతో తొక్కించి నిరసన తెలిపారు.కానీ ఇదంతా జగన్ అండ్ బ్యాచ్ పనేనని రైతులకు కిలో రూ.12 గిట్టుబాటు ధర కలిపించి ఇప్పటి వరకూ మొత్తం 50,922 మంది రైతుల నుంచి మామిడి కొనుగోళ్లు జరిగాయి జరిగాయి అని, మ్యాంగో పల్స్ పై ఉన్న 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని కేంద్రానికి ఇప్పటికే లేఖ రాసినట్టు అధికార పక్షం నేతలు తెలిపారు.

Tags:    

Similar News