జగనన్న నెల్లూరు పర్యటనపై ఎందుకంత భయం?మాజీ మంత్రి హాట్ కామెంట్స్
జూలై 3న జగన్ పర్యటన తథ్యం: అధికారుల కాలయాపనపై అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం;
పది రోజుల క్రితమే జగనన్న నెల్లూరు పర్యటన ఉంది అని మేము స్పష్టం చేశాం అన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మేము ముందుగానే 2½ కిలోమీటర్ల వరకు సెక్యూరిటీ అవసరం అయ్యేలా గుర్తించి,అధికారులు పరిమిషన్ కోసం అడిగినప్పటికీ ఇప్పటి వరకు ఏ మాత్రం స్పందించ లేదు అని ఆగ్రహం వ్యక్తం చేసారు.
పరిమిషన్ ఇస్తారా? లేదా? అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు అన్నారు.
ఈ సందిగ్ధత చూసినప్పుడు ఇది జగన్ పర్యటనను అడ్డుకునే కుట్రే కాదా? అని అనిపిస్తోంది.
మేము ఎంచుకున్న ప్రదేశం ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బంది కలగని ప్రాంతంగాతెలియచేసారు అనిల్.అధికారులే ఒక ప్రదేశాన్ని సూచించారు మేమూ ఆ ప్రదేశానికే కట్టుబడి ఉన్నాం.కానీ గత మూడు రోజులుగా వారి కలయపనతో స్పష్టత లేదు, అభ్యర్థనలపై స్పందన లేదు అని ధ్వజమెత్తారు మాజీ మంత్రి.
మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా, జూలై 3న జగన్ గారు నెల్లూరుకు రావడం తథ్యం అన్నారు.ఏమైనా అయినా ప్రజల మద్దతుతో ముందుకు సాగుతాం అని వివరించారు.నెల్లూరులో జగన్ పర్యటన ఒక ప్రభంజనంలా మారుతుందన్నది మీకు అర్థం కావాలి అని అధికార పక్షాన్ని ఉద్దెశించి మాట్లాడారు.ప్రజలకు అనుకూలంగా, సభ విజయవంతంగా జరగేలా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి అన్నారు,అధికారులు కాలయాపన చేస్తే మేము చెబుతున్నాం – జగన్ గారి నెల్లూరు పర్యటన ఖచ్చితంగా జరుగుతుంది అని స్పష్టం చేసారు వైస్సార్సీపీ మాజీ మంత్రి అనిల్