వైఎస్ జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ దంపతులు

137 రోజుల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన వంశీ, జగన్‌కు కృతజ్ఞతలు;

Update: 2025-07-03 08:29 GMT

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన సతీమణి ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని నివాసంలో కలిశారు.

137 రోజులపాటు జైల్లో ఉండిన వంశీ, నిన్న బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా వంశీ దంపతులు వైఎస్‌ జగన్‌ను కలిసి, కష్టకాలంలో అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తమపై చూపిన మానవతా దృక్పథానికి మరియు నైతిక మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News