పిల్లల ఆధార్ అప్‌డేట్ తప్పనిసరి
బాల ఆధార్ ఫోటో మాత్రమే – ఐరిస్, వేలిముద్రలు ఐదు ఏళ్ల తర్వాత తప్పనిసరి;
5 ఏళ్లు దాటి ఉన్న పిల్లల ఆధార్ తప్పనిసరిగా అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది లేకపోతే ఏడేళ్లు దాటిన తరువాత కూడా అప్‌డేట్ చేయకపోతే వారి ఆధార్ డీఅాక్టివ్ అయ్యే అవకాశం ఉందని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ తెలిపింది. ఎందుకంటే బాల ఆధార్ తీసుకున్న పిల్లలకు ఐదేళ్ల లోపు బయోమెట్రిక్ మరియు ఐరిస్ అవసరం లేకుండా కేవలం ఫొటో తీసి ఆధార్ జారీ చేయబడుతుంది, అయితే వారు ఏడేళ్లు పూర్తి చేయకముందే వారి బయోమెట్రిక్ వివరాలు అయిన వేలిముద్రలు ఐరిస్ స్కాన్ మరియు తాజా ఫొటోను దగ్గరలోని ఆధార్ నమోదు కేంద్రంలో అప్‌డేట్ చేయాలి దీనికి సంబంధించి వారి ఆధార్ నంబరుతో అనుసంధానమైన ఫోన్ నంబర్‌కు యూఐడీఏఐ నుంచి సమాచారం పంపుతోంది. ఐదు నుంచి ఏడేళ్ల మధ్య వయస్సు గల పిల్లల ఆధార్ అప్‌డేట్ ఉచితంగా చేయవచ్చు కానీ ఏడేళ్లు దాటిన తర్వాత అప్‌డేట్ చేయాలంటే రూ 100 చెల్లించాల్సి ఉంటుంది.