టీటీడీ–ఐఓసీఎల్ భాగస్వామ్యంలో గ్యాస్ స్టోరేజ్ కేంద్రం

బయో గ్యాస్ ప్లాంట్ & స్టోరేజ్ యూనిట్.. తిరుమలలో గ్రీన్ ఎనర్జీకి బలమైన అడుగు;

Update: 2025-07-17 11:43 GMT

తిరుమల భక్తుల సేవల విస్తరణలో మరో కీలక ముందడుగు పడింది. తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డులో 45 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గ్యాస్ స్టోరేజ్ కేంద్ర నిర్మాణానికి బుధవారం టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత రెండు దశాబ్దాలుగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) ఎల్పీజీని టీటీడీకి నిరంతరాయంగా సరఫరా చేస్తోందని ఆయన చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వచ్చే 30 సంవత్సరాల పాటు ఎల్పీజీ సరఫరా ఒప్పందం టీటీడీ-ఐఓసీఎల్ మధ్య కుదిరిందని వివరించారు.

ఈ ప్లాంట్‌ను రూ.8.13 కోట్ల వ్యయంతో 1.86 ఎకరాల విస్తీర్ణంలో, ఆరు నెలల వ్యవధిలో టీటీడీ-ఐఓసీఎల్ సంయుక్తంగా నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ గ్యాస్‌ను లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదాల తయారీకి వినియోగించనున్నామని, తద్వారా టీటీడీకి ప్రతి ఏడాది రూ.1.5 కోట్ల ఆదా కాగలదని వివరించారు.

ఐఓసీఎల్ మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీ వి. సతీష్ కుమార్ మాట్లాడుతూ, ఇప్పటికే తిరుమల డంపింగ్ యార్డు వద్ద రూ.12.05 కోట్ల వ్యయంతో బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణం జరగుతోందని చెప్పారు. ప్రతి రోజు వచ్చే 55 టన్నుల తడి వ్యర్థాలలో 40 టన్నులను ప్లాంటుకు తరలించి, రోజుకు 1000 కేజీల బయోగ్యాస్ ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు.

ఈ గ్యాస్ స్టోరేజ్ కేంద్రంలో 45 మెట్రిక్ టన్నుల మౌండెడ్ స్టోరేజ్ వెసల్స్తో పాటు 1500 కిలోల వేపరైజర్అ,గ్నిమాపక

యంత్రాంగం, స్ప్రింక్లర్ వ్యవస్థ మరియు రిమోట్ ఆపరేటింగ్ వాల్వులు,గ్యాస్ లీకేజ్ అలారం వంటి అధునాతనమైన టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.

Tags:    

Similar News