తెలంగాణ కోదాడ లో ఘోరం..విధి నిర్వహణలో ఆలమూరు ఎస్ ఐ దుర్మరణం

గంజాయి కేసు విచారణ కోసం కారులో వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమమదం;

Update: 2025-06-26 09:07 GMT

డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలానికి చెందిన ఎస్‌ఐ ఎం. అశోక్ మరియు కానిస్టేబుల్ బ్లెస్సిన్ జీవన్ రోడ్డు ప్రమాదం లో మృత్యువాత పడ్డారు.తెలంగాణలోని కోదాడ మండలం దుర్గాపురం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది.వీరితో పాటు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన హెడ్ కానిస్టేబుల్ స్వామి, డ్రైవర్ రమేష్ ఉన్నారు ,వీరిని దగ్గర లోని హాస్పిటల్ లో జాయిన్ చేసారు.

గంజాయి కేసు విచారణ కోసం నిందితులను పట్టుకునేందుకు హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది.విధి నిర్వహణలో డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్సై అశోక్‌ని కోల్పోవడం దురదృష్టకరం అని ,మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున అండగా ఉంటాం అని అన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత .ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన మిగతా పోలీస్ సిబ్బందికి మెరుగైన వైద్యం అందించాలి అని ఆదేశించారు.

ఎస్‌ఐ ఎం. అశోక్ మరియు కానిస్టేబుల్ బ్లెస్సిన్ జీవన్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం ఎంతో దురదృష్టకరమ‌ని విచారం వ్య‌క్తం చేసారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు గారు.గతంలో ఆరుగురు పిల్లల మిస్సింగ్ కేసులో చాక‌చ‌క్యంగా విధులు నిర్వ‌హించి 24 గంటల్లో చిన్నారుల ఆచూకి తెలుసుకుని ప్రశంస‌లు అందుకున్న‌ ఎస్సై అశోక్ ని గుర్తుచేసారు మంత్రి అచ్చెన్నాయుడు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తు, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.

Tags:    

Similar News