తెలుగు రాష్ట్రాల జల వివాదం: చర్చలకు కేంద్రం పిలుపు

జూలై 16న ఢిల్లీ చర్చలకు సిద్ధం కావాలని సీఎం లకు కేంద్రం లేఖ;

Update: 2025-07-15 07:49 GMT

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య న‌డుస్తున్న జల వివాదాలకు పరిష్కారం చూపేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు రంగంలోకి దిగింది. జూలై 16న రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఢిల్లీకి రావాల‌ని తెలిపింది, త‌మ స‌మ‌క్షంలో కూర్చుని చర్చలు జరుపుకోవాలి అని కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ రెండు రాష్ట్రాల‌కు లేఖ‌లు పంపించింది.

ఈ పరిణామం నేప‌థ్యంలో క‌ర్నూలు జిల్లాలో న‌వ్యాంధ్ర ప్ర‌భుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టు మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సీఎం చంద్ర‌బాబు ఈ ప్రాజెక్టును రాష్ట్రాభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా అభివ‌ర్ణిస్తూ, దీనికి కేంద్ర అనుమ‌తులు ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

అయితే, తెలంగాణ ప్ర‌భుత్వం మాత్రం ఈ ప్రాజెక్టుకు తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది. జలాల పంపిణీపై స్పష్టత లేకుండా ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టడం సరికాదని, బనకచర్ల నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని తేల్చి చెబుతోంది తెలంగాణ సర్కార్. ఇటు ప్రతిపక్షాల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఒత్తిడి పెరిగింది.రాబోవు సార్వత్రిక మరియి జూబ్లీహిల్స్ ఎన్నికలలో బీజేపీ కి చెక్ పెట్టె ఉదేశంలో తెలంగాణ కాంగ్రెస్ చూస్తుంది.

కేంద్ర పర్యావరణ శాఖ ఇప్పటికే ప్రాజెక్టుపై అనుమతులు తిరస్కరించినా, ఏపీ ప్రభుత్వం తాము తగిన వివరణలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించింది. ముఖ్యంగా, గోదావరి నుంచి వదిలే మిగులు జలాల లెక్కింపు, వాటి వినియోగంపై కేంద్రం శాస్త్రీయంగా సమీక్షించాలని కోరుతోంది.

రాష్ట్ర విభజన సమయంలో కృష్ణా నది జలాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, తాజా పరిస్థితుల్లో రాష్ట్రాల వారీగా స్పష్టమైన జల పంపిణీ కావాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో జూలై 16న జరగబోయే సమావేశం రెండు రాష్ట్రాల మ‌ధ్య ఉన్న నీటి వివాదాల పరిష్కారానికి కీలకంగా మారే అవకాశముంది. అయితే, తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా కేంద్రం ఈ సమస్యపై ఏ విధంగా స్పందిస్తుందన్న‌ది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News