జస్టిస్ వర్మ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

వర్మ ఇంట్లో భారీగా నగదు దొరకడంతో న్యాయవ్యవస్థలో కలకలం - కమిటీ తీరులో తప్పులేదని కోర్టు స్పష్టం;

Update: 2025-08-07 09:30 GMT

జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు దొరికినట్టు వచ్చిన సమాచారం తీవ్ర దుమారం రేపింది.న్యాయ వ్యవస్థేకే కళంకం తీసుకొచ్చిన ఈ ఘటనపై విచారణ చేయడానికి సుప్రీమ్ కోర్ట్ ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో ఒక కమిటీ ఏర్పాటుచేసింది.ఈ కమిటీ చేసిన దర్యాప్తులో, వాస్తవంగా వర్మ గారి ఇంట్లో నోట్ల కట్టలు దొరికినట్టు తేల్చింది. అలాగే, ఆయన ప్రవర్తనపై అనుమానాలు ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు.

జడ్జిగా ఉన్న యశ్వంత్ వర్మ పై ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన కమిటీ చేసిన దర్యాప్తు నివేదికను తప్పు అనే అభిప్రాయంతో, ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ఆయన ప్రవర్తన న్యాయవ్యవస్థపై విశ్వాసం కలిగించదని కోర్టు వ్యాఖ్యానించింది.

సుప్రీంకోర్టు తెలిపిన ప్రకారం హైకోర్టు జడ్జిలతో కమిటీ ఏర్పాటు చేయడం చట్టపరంగా సరైన పద్ధతి అని, దర్యాప్తులో తప్పేం జరగలేదని కోర్టు స్పష్టంగా చెప్పింది.వర్మ గారు తన హక్కులు దెబ్బతిన్నాయని వాదనలు వినిపించినా, కానీ కోర్టు అంగీకించలేదు.

వర్మ గారు నివేదికను మళ్లీ పరిశీలించాలని అడిగినా, కోర్టు ఒప్పుకోలేదు.ఈ నివేదికపై మరోసారి విచారణ అవసరం లేదని సుప్రీమ్ కోర్టు తేల్చి చెప్పింది. అందుకే ఆయనకు ఇక మరో అవకాశం దొరికే అవకాశంలేదు.

ఈ తీర్పుతో ప్రభుత్వం ఇక వెంటనే పార్లమెంటులో యశ్వంత్ వర్మపై శాసనపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అంటే, ఆయనను పదవి నుంచి తొలగించే చర్యలు వేగంగా ప్రారంభమయ్యే అవకాశముంది.

Tags:    

Similar News