సింహాచల అప్పన్న గిరి ప్రదక్షణ ప్రారంభం- వేలాదిగా తరలివచ్చిన భక్తులు
సాయంత్రం 5 తరువాత భక్తుల రద్దీ తారాస్థాయికి చేరనున్నట్లు అంచనా;
విశాఖపట్నం జిల్లా సింహాచలంలో పవిత్ర సింహాచల అప్పన్న గిరి ప్రదక్షణ సందర్భంగా సింహాచలంలో భక్తుల సందడి నెలకొంది. మండుటెండలోనూ భక్తులు విశేష ఉత్సాహంతో అప్పన్న కొండ చుట్టూ కాలనడకను కొనసాగిస్తున్నారు. భక్తి, నిబద్ధత, ఆధ్యాత్మికతతో నిండి ఉన్న ఈ యాత్రకు వేలాదిగా భక్తులు హాజరవుతున్నారు.
ప్రతీ సంవత్సరం ఆషాఢమాసం పౌర్ణమి రోజున జరుపుకొనే సింహాద్రి అప్పన్న గిరి ప్రదిక్షణ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు గిరి క్రింద ఉన్న మెట్ల మార్గం నుండి మొదలుపెట్టారు ఆలయ అర్చకులు,ఈ గిరి ప్రదిక్షణ లో శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి ని పూల రధంలో గిరి ప్రదిక్షణ లో ఊరేగిస్తారు.సుమారు 32 కిలోమీటర్లు ఉన్న సింహాద్రి అప్పన్న గిరి ప్రదిక్షణ రేపు మధ్యాహ్నం 2 గంటలకు ముగుస్తుంది.
ఈసారి గిరి ప్రదక్షణ నిర్వహణలో మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ను వినియోగిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు అధికారులు 8K రిజల్యూషన్ ఉన్న డ్రోన్లను వినియోగిస్తున్నారు.ప్రదిక్షణ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంగటనలు జరగకుండా ప్రతి మూలను మానిటరింగ్ చేస్తూ పోలీసులు అణువణువూ గమనిస్తున్నారు.
సాయంత్రం 5 గంటల తర్వాత భక్తుల సంఖ్య లక్షల్లోకి పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నీటి పందిరులు, మెడికల్ టీమ్స్, షేడ్లు, ట్రాఫిక్ కంట్రోల్ వంటి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తిచేశారు.
ప్రతి అడుగులో భక్తి జ్ఞానాన్ని ప్రసరించే ఈ ప్రదక్షణ... విశాఖ ప్రజలకు ఆధ్యాత్మిక పండుగలా మారుతోంది.