భారత నిర్మాణాలపై నష్టం చూపించండి - విదేశీ మీడియాపై ఎన్‌ఎస్‌ఏ విమర్శ

భారత దళాల ఖచ్చిత దాడులపై నిర్ధారణ – పాకిస్థాన్ 13 ఎయిర్‌బేస్‌లకు గాయాలు;

Update: 2025-07-12 12:01 GMT

2025 మే 7న భారత వైమానిక దళాలు చేపట్టిన ఒపరేషన్ సిందూర్, కేవలం ఒక ప్రతీకార చర్య కాదు. ఇది దేశ భద్రతపై స్పష్టమైన సందేశం, ఉగ్రవాదంపై అసహనం మరియు సాంకేతిక పరాకాష్ట ప్రదర్శనగా నిలిచింది. కానీ ఈ దాడిని మరోవిధంగా మలచేందుకు విదేశీ మాధ్యమాలు చేసిన ప్రయత్నాలను, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తప్పుపట్టారు.

భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దేశం ముందు నిలిచిన అంతర్జాతీయ మీడియా దిష్టిబొమ్మలను తేటతెల్లం చేశాయి. ‘‘ఒక ఫోటో చూపించండి... భారతదేశానికి జరిగిన నష్టం ఏదైనా?’’ అంటూ విదేశీ మాధ్యమాల వైఖరిని ప్రశ్నించిన దోవల్, వాస్తవాన్ని మించిన కథనాలపై సమయోచితంగా సంభావితమైన జవాబుగా నిలిచారు.

2025 మే 7న భారత వైమానిక దళాలు పాకిస్థాన్ లోపల ప్రవేశించి నిర్వహించిన ఒపరేషన్ సిందూర్, కేవలం ప్రతీకారం కాదు, ఒక స్ట్రాటెజిక్ మెసేజ్. ఏప్రిల్ 22న పహల్గామ్ లో జరిగిన అమానుష ఉగ్రదాడిలో 26 మంది అమాయకుల ప్రాణాలను కోల్పోయిన తర్వాత, దేశం అసహనానికి లోనైంది. కానీ, ఆ అసహనం ఆవేశంగా కాకుండా ఆత్మవిశ్వాసంగా మారింది. అదే సమయానికి భారత దళాలు పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాద శిబిరాలపై శాస్త్రీయంగా, ఖచ్చితంగా దాడులు జరిపాయి దోవల్ స్పష్టం చేశారు.

"లక్ష్యాలే గాని మరెక్కడా మేము దాడి చేయలేదు." ఇది కేవలం ఒక ఆపరేషన్‌ కాదు, దేశ భద్రతపై నిర్ధిష్ట దృక్పథానికి ప్రతీక. విదేశీ మీడియా మాత్రం మరో కోణంలో కథను తీర్చిదిద్దే ప్రయత్నం చేసింది అని విరుచుకుపడ్డారు. నిష్పక్షపాతత పేరిట, భారతపై ప్రతికూల వార్తలను సృష్టించారు. కానీ, మే 10కు ముందు, తరువాత పాకిస్థాన్‌లోని 13 ఎయిర్ బేస్‌ల ఫోటోలు భారత వైమానిక దాడుల తీవ్రతను నిరూపించాయి అని దోవల్ గుర్తు చేసారు. ఇదే సమయంలో భారతావైపు జరిగిన నష్టం ఏదైనా చూపించండి అన్న దోవల్ ప్రశ్న మాత్రం విదేశీ విశ్లేషకుల మౌనాన్ని చాటిచెప్పింది.

అంతర్జాతీయ సమాజంలో భారత్ తమ బాధ్యతాయుతమైన ధోరణిని మరోసారి చాటిచెప్పింది అన్నారు దోవల్. రక్షణలో మర్యాదా బలాన్ని నిలుపుకుంటూ, మితిమీరిన ప్రదర్శనకు దూరంగా, భారత వైఖరి ఇప్పుడు ఒక అధ్యయనంగా మారింది.భారత నిర్మాణాలపై జరిగిన నష్టం ఉన్నట్టు చెబుతున్న వారు, ఒక్క ఫోటోనైనా చూపగలరా? అని అంతర్జాతీయ మీడియా ని ఘాటుగా ప్రశ్నించారు అజిత్ దోవల్.

Tags:    

Similar News