కాకినాడ జిల్లా ఉప్పాడ తీరానికి మోక్షం
పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గానికి ప్రాధాన్యత - ఉప్పాడ సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు;
కాకినాడ జిల్లా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురం మండలంలోని ఉప్పాడ సముద్ర తీరం ప్రతీ సంవత్సరం తీర ప్రాంతం కోతకు గురి అవుతూనే ఉంటుంది.ప్రభుత్వాలు నాయకులు మారిన ఉప్పాడ ప్రజల దుస్థితి మారడంలేదు.పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం అవ్వడం వల్ల ప్రభుత్వం ఈ ప్రాంతం పై ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఇన్నాళ్లకు తీర ప్రాంతానికి మోక్షం లభించింది,కాకినాడ జిల్లా ఎంపీ గౌరవ శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, తమ కృషికి ఫలితాలు లభిస్తున్నాయని ప్రకటించారు. సముద్ర అలల తాకిడికి ఉప్పాడ తీరప్రాంతం గత మూడేళ్లుగా క్రమంగా క్షీణిస్తోంది అని. ప్రతి ఏడాది సగటున 1.23 మీటర్ల మేర తీరము కోతకు గురవుతుండగా, 2017-18లో ఒక్క ఏడాదిలోనే ఇది 26.3 మీటర్ల వరకు పెరిగిందని ఎంపీ తెలిపారు.
ఈ తీర కోత కారణంగా ఉప్పాడ, నేమం, అమీనాబాద్, సుబ్బంపేట, కొమరగిరి వంటి మత్స్యకార గ్రామాల ప్రజల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆయన తెలిపారు. రోడ్లు ధ్వంసమవ్వడంతో రాకపోకలకూ తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయని వివరించారు.
తీరప్రాంతాన్ని రక్షించేందుకు శాశ్వత పరిష్కారం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనలతో కేంద్ర హోంశాఖ ప్రతినిధులతో సమావేశం నిర్వహించామని, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి (NDMA) మార్చి 17న లేఖ పంపినట్లు వెల్లడించారు.
ఆ లేఖలో తీర కోత వల్ల ఎదురవుతున్న నష్టాలను విశ్లేషణాత్మకంగా వివరించడంతో పాటు, రక్షణ గోడ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను తక్షణమే ఆమోదించాలన్న విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
దీనిపై స్పందించిన కేంద్రం ఈ ప్రతిపాదనలను చెన్నైలోని నేషనల్ సెంటర్ ఫర్ కోస్ట్ రీసెర్చ్‌కి పంపగా, వారు రూ. 323 కోట్ల వ్యయంతో టెట్రాపాడ్‌ల ఆధారంగా శాశ్వత రక్షణ గోడ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారని వెల్లడించారు.
ఈ ప్రతిపాదనలు ఆమోదించేందుకు ఈ నెల 30న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన సబ్‌కమిటీ సమావేశం జరగనున్నట్లు ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు తెలిపారు.