రూ.1290 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన

జల జీవన్ మిషన్‌కు నూతన శక్తి – కూటమి ప్రభుత్వ ప్రతిబద్ధతకు నిదర్శనం;

Update: 2025-07-04 16:50 GMT

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి తాగునీటి కొరతను తీర్చే దిశగా, రూ.1290 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రారంభమైన జల జీవన్ మిషన్ ప్రాజెక్టు రాష్ట్రానికి గర్వకారణమైంది. ఈ ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేయడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి గట్టి పునాదులు వేసినట్టయింది. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తాగునీటి కోసం చేపట్టిన అతిపెద్ద పథకాలలో ఒకటిగా నిలుస్తోంది.

మొదటగా 10 లక్షల మందికి తాగునీటి సరఫరా అయ్యే విధంగా ఈ ప్రాజెక్ట్ మొదలవుతుంది అన్నారు పవన్. జల జీవం మిషిన్ ప్రాజెక్ట్ లో భాగంగా ఒక వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, 19 సంపులు, 334 ఓవర్‌హెడ్ ట్యాంకులు, 5000 కిలోమీటర్ల పైపులైన్లు నిర్మించనున్నారు అని తెలియచేసారు.ఎర్రగొండపాలెం, ఒంగోలు, కనిగిరి, కొండపి, గిద్దటూరు, దర్శి, మార్కాపురం నియోజకవర్గాల్లోని 18 మండలాలు, 578 గ్రామాలు, వెలిగొండ ప్రాజెక్టు ద్వారా వచ్చే కృష్ణా నది నీటిని శుద్ధి చేసి సరఫరా చేయన్నున్నట్టు పవన్ తెలియచేసారు.

వైసీపీ పాలనలో జల జీవన్ మిషన్‌కు కేవలం పైప్ లైన్ల పేరుతో రూ. 4 వేల కోట్లను ఖర్చు చేసి ఏ వ్యక్తికీ ఉపయోగపడని పరిస్థితి ఏర్పడిందని పవన్కళ్యాణ్ తీవ్రంగా విమర్శించారు. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల పథకం నిలిచిపోయిందన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పునరుజ్జీవం పొందిన జల జీవన్ మిషన్ పథకం, నరేంద్ర మోడీ గారి కలను కార్యరూపం దాల్చిందన్నారు. 15 ఏళ్ల స్థిర పాలనతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.వైసీపీ శిలాఫలకాలు పెట్టి ఫేక్ ప్రచారం చేసినట్టు, వాస్తవానికి అది పూర్తిగా పూర్తి కాలేదని పేర్కొన్నారు. ఇప్పుడు తాగునీటి సరఫరా మాత్రమే కాకుండా, పరిశ్రమల అభివృద్ధికి కూడా దోహదం చేసేలా ప్రణాళిక ఉందన్నారు.

మార్కాపురంలోని చెన్నకేశవ స్వామి ఆలయ భూముల ఆక్రమణపై స్పందించిన పవన్ కళ్యాణ్ గారు, వైసీపీ పాలనలో దేవాలయ భూములు కూడా వదిలిపెట్టలేదని, వాటిని తిరిగి రికవరీ చేయడమే తమ లక్ష్యమన్నారు.

పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పేర్కొన్నది ఏమంటే, తేడాలు ఉన్నా, ఐక్యత ఉంటే శక్తి పెరుగుతుంది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టిడిపి–జనసేన కలిసి పనిచేస్తున్నాయి. శ్రీ చంద్రబాబు గారి ఆర్థిక పరిపాలన అనుభవం, నరేంద్ర మోడీ గారి సంకల్పబలంతోనే రాష్ట్రానికి పెద్ద మొత్తంలో నిధులు రాబట్టగలిగామన్నారు.

ఈ పథకం పునరుద్ధరణను చూసి తేలిపోతున్న విషయం ఏమిటంటే, కూటమి ప్రభుత్వానికి ఉన్న నిర్ధారణ, కార్యచటన మరియు కేంద్ర సంబంధాలు దోహదపడుతున్నాయి. ఎవరెన్ని విమర్శలు చేసినా, వాస్తవ పనితీరు, అభివృద్ధి లక్ష్యాలపై దృష్టి పెట్టడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ తరహా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ఒక నియోజకవర్గం పరిమితిని దాటి, ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచే దిశగా ముందుకు తీసుకెళ్లే పథకాలు కావడం గమనించాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కేంద్రంతో ఉన్న అనుసంధానం, టిడిపి అనుభవం కలిసి ఆంధ్రప్రదేశ్ కు మంచి తాగునీటి విప్లవానికి దారి తీస్తాయని ఆశించవచ్చు.

Tags:    

Similar News