మార్కాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన..రూ.1290 కోట్ల తాగు నీటి పథకానికి శంకుస్థాపన

పది లక్షల మందికి శుద్ధమైన తాగు నీటి అందుబాటుకు రూపురేఖలు;

Update: 2025-07-02 11:42 GMT

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మరియు ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖ మంత్రిగా సేవలందిస్తున్న జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 4వ తేదీ ఉదయం ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

ఈ సందర్భంగా, జిల్లా ప్రజల ప్రగతికి దోహదపడే విధంగా రూ.1290 కోట్ల విలువగల అతి పెద్ద తాగు నీటి పథకం పనులకు నరసింహపురం గ్రామంలో శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 10 లక్షల మందికి శుద్ధమైన తాగు నీటి సరఫరా జరిగేలా ప్రణాళికలు రూపొందించబడ్డాయి.

శంకుస్థాపన అనంతరం ఉదయం 10 గంటలకు నిర్వహించబోయే బహిరంగ సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా జనసేన కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశముంది.Pawan Kalyan's visit to Markapuram... Foundation stone laid for Rs. 1290 crore drinking water scheme

Tags:    

Similar News