ఆగస్టు 1 నుంచి యూపీఐ యాప్ కొత్త నిబంధనలు

యూపీఐ సేవలు ఇప్పుడు విదేశాల్లో కూడా – 7 దేశాల్లో విస్తరణ;

Update: 2025-07-26 14:02 GMT

డిజిటల్ చెల్లింపుల విషయంలో యూపీఐ కి సంబంధించి కీలక మార్పులు రాబోతున్నాయి.నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలను అమలు చేస్తున్నాయి.యూపీఐ సర్వేర్లపై వత్తిడి తగ్గించే భాగంగా ఇప్పుడు కొత్త రూల్స్ అమలు చేస్తున్నాయి.బాలన్స్ చెక్ ,ఆటో పేమెంట్ కు సంబంధించి కొన్ని నిబంధనలు మారనున్నాయి.

ఒక్కపుడు బ్యాంకు ఖాతాలు చూసుకోవడానికి చాలా ఇబ్బందులు ఉండేవి.ఇప్పుడు యూపీఐ యాప్ వచ్చి గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి ప్రైవేట్ యాప్ ల ద్వారా బ్యాంకు లావాదేవీలు మరింత సులభతరం అయిపోయాయి.బ్యాంకులకు ఎటిఎంకు వెళ్లే పని తగ్గింది,ఈ డిజిటల్ ట్రాన్సక్షన్ వల్ల నగదు చలామణి పూర్తిగా తగ్గిపోయింది.ఇప్పుడు వీటికి కొన్ని నిబంధలను విధిస్తున్నారు ఇకనుంచి రోజుకి 50 సార్లు మాత్రమే బాలన్స్ చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది.లింకైన ఖాతాలకు అయితే రోజుకు 25 సార్లే మాత్రమే చూడగలం.

ఆటోమేటిక్ పేమెంట్ విషయంలోనూ ఎన్ పిసిఐ కొత్త నిబంధలను తీసుకు వచ్చింది.సబ్ స్క్రిప్షన్, క్రెడిట్ కార్డు మొదలగు ఆటో పేమెంట్ పే మెంట్లు రద్దీ లేని సమయాలలో మాత్రమే డిజిటల్ లావాదేవీలు జరిగేలా ఉండాలి అని సూచించింది.ఆటో రిక్వెస్ట్ పెట్టే సంస్థలు రద్దీ లేని సమయంలోనే రిక్విస్ట్ పెట్టాలని ఆంక్షలు విధించింది.యూజర్ లకి మాత్రం ఈ అక్షాలనుంచి వెసులుబాటు కల్పించింది.

యూపీఐ (UPI) వ్యవస్థను నిర్వహించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం, మే 2024లో 1,868 కోట్లు లావాదేవీలు జరిగాయి. ఇది ఏప్రిల్‌లో జరిగిన 1,789 కోట్లు లావాదేవీలతో పోల్చితే మళ్లీ తిరిగి లాభదాయక స్థితిలోకి వచ్చినట్లు సూచిస్తుంది.

మే నెలలో మొత్తం యూపీఐ లావాదేవీల విలువ రూ. 25.14 లక్షల కోట్లు, ఏప్రిల్‌లో ఇది రూ. 23.95 లక్షల కోట్లు. ఇదే సమయంలో గత ఏడాది మేతో పోల్చితే, యూపీఐ వాల్యూమ్‌లో 33% వృద్ధి నమోదైంది. అంటే 2023 మేలో 1,403 కోట్లు లావాదేవీలు మాత్రమే జరిగాయి.ఒక్క మే నెలలోనే రోజూ సగటున 60 కోట్లు ట్రాన్సాక్షన్లు జరిగాయి

2016లో ప్రారంభమైన యూపీఐ – డిజిటల్ ఇండియా లక్ష్యంతో ప్రభుత్వం తీసుకున్న ప్రయత్నాలు, నోట్ల రద్దు, స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరగడం, గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి ప్రైవేట్ యాప్ ల ప్రవేశం ... ఇవన్నీ కలిసి UPI తమ విజయాన్ని వేగవంతం చేశాయి.

గత కొన్ని నెలలుగా యూపీఐ సేవల్లో విఘాతం ఏర్పడింది. ముఖ్యంగా ఏప్రిల్ 12న వేలాది మంది వినియోగదారులు తమ చెల్లింపులు పూర్తి చేయలేకపోయారు. NPCI ప్రకారం, కొన్ని బ్యాంకులు "చెక్ ట్రాన్సాక్షన్" APIను అధికంగా ఉపయోగించడం వల్ల సర్వర్‌పై ఒత్తిడి పెరిగింది. దీని వల్ల కొన్ని గంటలపాటు UPI వ్యవస్థ నెమ్మదిగా పనిచేసింది.

ప్రస్తుతం ఫోన్‌పే మరియు గూగుల్ పే కలిపి యూపీఐ మార్కెట్‌లో 80% వాటాను కలిగి ఉన్నాయి. అయితే ఇటీవల Super.Money, Navi, BHIM, Cred వంటి కొత్త యాప్‌లు క్యాష్‌బ్యాక్‌లు, ఇన్సెంటివ్‌లతో బాగా పాపులర్ అవుతున్నాయి. మే నెలకి యాప్‌వారీగా గణాంకాలు NPCI విడుదల చేయలేదు.

చిన్న మొత్తాల డిజిటల్ లావాదేవీల ఖర్చు భరిస్తూ, కేంద్ర ప్రభుత్వం రూ. 1,500 కోట్ల ఇన్సెంటివ్ పథకాన్ని మళ్లీ అమలు చేస్తోంది. అయితే, కొన్ని ఫిన్‌టెక్ కంపెనీలు, ఇంత తక్కువ మొత్తంతో యూపీఐ నెట్‌వర్క్‌ను నిర్వహించడం కష్టమని విమర్శిస్తున్నాయి.

ఫోన్‌పే, గూగుల్ పే లాంటి యాప్‌లు మార్కెట్‌లో అధికంగా ఉండటంతో NPCI – మూడో పార్టీ యాప్‌లపై గరిష్టంగా 30% మార్కెట్ షేర్ అనే నియమాన్ని తీసుకొచ్చింది. ఇది 2026 డిసెంబర్ వరకు పొడిగించబడింది. ఈ షరతు మొదట 2020లో ప్రతిపాదించబడినప్పటికీ, చాలాసార్లు వాయిదా పడింది.

ఇప్పుడు యూపీఐ సేవలు సింగపూర్, యూఏఈ, శ్రీలంక, మౌరిషస్, ఫ్రాన్స్, భూటాన్, నేపాల్ వంటి దేశాల్లో కూడా అందుబాటులోకి వస్తున్నాయి. అంటే ఇండియాలో మొదలైన యూపీఐ ప్రయాణం ఇప్పుడు అంతర్జాతీయంగా కొనసాగుతోంది.

Tags:    

Similar News